గుణ్ణం గంగరాజు కొత్త చిత్రం టైటిల్ ఇదే
హైదరాబాద్ : లిటిల్ సోల్డియర్స్, అమ్మ చెప్పింది వంటి చిత్రాల ద్వారా దర్శకుడుగా తానేంటో ప్రూవ్ చేసిన గుణ్ణం గంగరాజు మరో సారి మెగా ఫోన్ పట్టి... ఓ చిత్రం రూపొందిస్తున్నారు. తమ టీవీ ప్రొడక్షన్స్ అమృతం సీరియల్ నే సినిమా గా మార్చి చేస్తున్నారు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో అమృతం టీమ్ ఇంటూరి వాసు(సర్వం),శివన్నారాయణ(అప్పాజీ) కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చందమామ లో అమృతం అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని గుణ్ణం గంగరాజు ఖరారు చేసి చెప్పారు.
గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో వారి అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన ఈ టీవీ సీరియల్ సినిమాగా రానుండటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
జస్ట్ యల్లో బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.అలాగే సీరియల్ క్యారెక్టర్స్ కి కొత్త స్టోరీ లైన్ అనుకుని సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్ధాయిలో నవ్వించే చిత్రంగా తయారవుతందని చెప్తున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని వినికిడి.


Click it and Unblock the Notifications












