twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీ జాక్సన్ ...వైల్డ్ ఫోజ్ (సెక్సీ ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో నిరంతరం హాట్ గా ఉంటూ వార్తల్లో నిలచే హీరోయిన్ ఎవరూ అంటే తడుముకోకుండా చెప్పే పేరులా మారింది అమీ జాక్సన్ ది. ఆమె 'ఐ' చిత్రంలో చేసిన తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టీని ఆకర్షించింది. ఆమెకు వరస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె చాలా సంతోషంగా ఉంది ఈ పరిణామంతో. ఈ నేపధ్యంలో తాజాగా మాగ్జిమం పత్రికకు ఇచ్చిన ఫొటో షూట్ లోని ఈ స్టిల్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వైల్డ్ ఫోజ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అమీ జాక్సన్ మాట్లాడుతూ... 'శివతాండవం'లో తొలిసారి విక్రమ్‌ సరసన నటించే అవకాశం. 'ఎవడు'లో రామ్‌చరణ్‌ పక్కన అవకాశం వచ్చింది. నేను అది వరకు చేసినవి చాలా సీరియస్‌ పాత్రలు. ఇందులో కొంత కామెడీ ఉంది, జాలీగా అనిపిస్తుంది. ఒప్పుకున్నాను. అప్పుడే హైదరాబాద్‌ వచ్చాను. తెలుగు రాకపోయినా.. హైదరాబాద్‌ చాలా నచ్చేసింది. ఆ చిత్రం ముగుస్తుండగానే శంకర్‌ నుంచి 'ఐ' పిలుపొచ్చింది.

    Amy is back with wild pose

    ఆరోజు ఎగిరి గంతేసినంత పనిచేశా. ఒకే చిత్రంలో నలుగురు గొప్ప కళాకారులు.. శంకర్‌, పీసీ శ్రీరామ్‌, ఏఆర్‌ రెహ్మాన్‌, విక్రమ్‌తో పనిచేసే అవకాశం వచ్చిందంటే.. ఐ యామ్‌ లక్కీ కదా! మామూలుగా శంకర్‌ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా పనుండదని అంటారు. కానీ ఇది వేరు. ఇదో లవ్‌ థ్రిల్లర్‌ అనొచ్చు. నా జీవితంలో మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే ఇదొక్కటే ఒకెత్తు. ఈ ఒక్క చిత్రానికే రెండేళ్లు తీసుకున్నాను. ఆ కష్టం వృథా పోలేదు. ఆడియో వేడుకలో శంకర్‌, విక్రమ్‌ ప్రశంసలు నా జీవితంలో మరవలేనివి. ఆ మాటలకు ఎంత ఐసైపోయానో చెప్పలేను అన్నారు.

    ఇక భారత్‌కి వచ్చాక ఇక్కడి సంస్కృతినీ, భాషనీ అర్థం చేసుకోవడం కష్టమే అయినా పెద్దగా ఇబ్బంది పడ్డది లేదు. నేను తీవ్రంగా బాధపడ్డ అంశాలు వేరే ఉన్నాయి. నా రెండో చిత్రం నుంచే ఒక్కసారిగా నన్ను పుకార్లు చుట్టుముట్టాయి. మొదట్లో చాలా బాధపడ్డా. పట్టించుకోవడం మానేశా. నేను కేవలం మోడల్‌నయితే ఇలాంటివి వచ్చి ఉండకపోవచ్చుగానీ... సినిమా అన్నాక తప్పదు కదా అని సర్ది చెప్పుకున్నా అన్నారామె.

    అలాగే...కానీ గాసిప్స్‌కంటే నా మనసుని కలచివేసిన అంశం మరొకటుంది. 'ఈ తెల్లమ్మాయి మనదేశంలో పని చేయడమేమిటీ.. మనకెవరూ లేరా.. ఈ దేశం గొడ్డుబోయిందా!' అన్న గగ్గోలు మొదలైంది. ఈ దేశాన్ని రెండో పుట్టిల్లుగా భావిస్తున్న నాకవి చెంపపెట్టులా తగిలాయి. చాలా బాధపడ్డా. కానీ అవి చేసేవాళ్లు కొందరేననీ... ఇక్కడి సామాన్యులు దేశం, మతం, జాతులకతీతంగా అందర్నీ అక్కున చేర్చుకోగలరని అర్థమైంది. భారత్‌ గొప్పతనం అదే! అందుకే ఈ దేశాన్ని నేనింతగా ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు.

    English summary
    Brit beauty Amy Jackson who is more famous for her raunchy photo shoots once gain offers a visual feast to audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X