»   » ఓ స్టార్ హీరోని ఆల్రెడీ లైన్ లో పెట్టి, మరో స్టార్ హీరోని మడతెట్టే పనిలో పాప బిజీ

ఓ స్టార్ హీరోని ఆల్రెడీ లైన్ లో పెట్టి, మరో స్టార్ హీరోని మడతెట్టే పనిలో పాప బిజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: భజన కాలక్షేపానికి వేళాయరా అన్నట్లుగా బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్...ఇప్పుడు రోబో 2 టీమ్ ని పొగడ్తల్లో ముంచెత్తుతోంది. బ్రిటన్ లో పుట్టి, సౌత్ సిని ఇండస్ట్రీని ఏలుతున్న ఆమె బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగా సల్మాన్ ని దువ్వటంతో పాటు, అక్షయ్ కుమార్ ని సైతం లైన్లో పెట్టే పనిలో ఉంది.

లైన్లో పెట్టడం అంటే వేరే అర్దం ఊహించుకునేరు. వాళ్లను కాస్త పొడగ్తల్లో పడేసి, మెల్లిగా తనకు వారితో ఉన్న పరిచయాన్ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకువెళ్లి, వారి సరసన సినిమా ఆఫర్ పట్టే పనిలో ఉంది అమీ జాక్సన్. అందుకోసం ఏకంగా ఆర్నార్డ్ ఎందుకు పనికొస్తాడు నీ సత్తా ముందు అని అక్షయ్ ని పడేస్తోంది.

అఫ్ కోర్స్ అక్షయ్ కు ఇలాంటి పొగడ్తలు చాలా వినే ఉంటాడు. ఇప్పటికీ వింటూనే ఉంటాడు. అయితే ఇంత గొప్పగా ఓ అందగత్తె పొగిడితే మాత్రం మనస్సు ఊరుకుంటుందా. అందులోనూ పెళ్లికు ముందు ప్లే బోయ్ అనే పేరు తెచ్చుకున్న రసికుడు అయ్యే. కానీ ఆమె విషయంలో కంట్రోలు అంటున్నాడట. ఎందుకంటే సల్మాన్ చూపు కూడా అమీ మీదే ఉంది మరి.

నువ్వే రికమండ్ చేసావంటగా

నువ్వే రికమండ్ చేసావంటగా

ఇలా ఓ హీరోయిన్ పనిగట్టుకుని ...హీరోగారిని లైన్ లో పెట్టే పనిలో ఉంటే మీడియా ఊరుకుంటుందా. వెంటనే ఆమె ముందు వాలిపోయి... ఓ ఇంటర్వూ పెట్టేసింది. అంతేకాదు...అసలు నువ్వే అక్షయ్ ని రికమెండ్ చేసావంటగా..శంకర్ సార్ తో ఉన్న చనువుతో అని అడిగేసింది.

ఎంత ఆనందపడిందో కానీ..

ఎంత ఆనందపడిందో కానీ..

శంకర్ లాంటి డైరక్టర్ నువ్వే నా సినిమాకు విలన్ ని ఎంపిక చేయి అని అడగాడటంగా అని అడిగితే ఆమె పరిస్దితి చూడాలి. ఎంత సిగ్గుపడిందో..మనస్సులో ఎంత ఆనందపడిందో కానీ పైకి మాత్రం పక్కున నవ్వేసింది. ఊరుకోండి ..మీరు మరీను...కాకపోతే ఆ ప్రాసెస్ నాకు తెలుసు అంది.

హిందీ ప్రేక్షకులను ఎర

హిందీ ప్రేక్షకులను ఎర

నిజం చెప్పాలంటే...మొదటి వాళ్లు ఆర్నాల్డ్ ని విలన్ గా అనుకున్నారు. కానీ తర్వాత సీన్ లోకి అక్షయ్ వచ్చారు. నేను ఖచ్చితంగా చెప్పగలను..ఆర్నాల్డ్ కన్నా అక్షయ్ చాలా బెస్ట్. బాలీవుడ్ ప్రేక్షకులను అతను ఎట్రాక్ట్ చేయగలడు. అతను చాలా తెలివైనవాడు..ఇంకా చాలా విషయాల్లో అక్షయ్ కేక అనేసింది.

భలే ఫన్ ..

భలే ఫన్ ..

అక్షయ్ గురించి ఎంతని చెప్పగలను. అక్కి నేను కలిసి ఇప్పుడు కలిసి చేస్తున్నాం. ఇంతకు ముందు షెడ్యూల్ లలో మా ఇద్దరి మధ్యా సీన్స్ లేవు. అతనితో కలిసి పనిచేయటం భలే ఫన్ గా ఉంటుంది. అతను ఎక్సలెంట్ కో స్టార్. అతనితో కలిసి రెండో సినిమా చేస్తున్నా..చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది నాకు అనేసింది.

ఒకే ఫ్రేమ్ లో ...

ఒకే ఫ్రేమ్ లో ...

రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పేదేముంది. ఆయన లాంటి లెజండ్ తో కలిసి పనిచేయటం అద్బుతమే. ఆయన తో రోజూ కలిసి పనిచేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే సెట్ లో ఆయన తో ఉండటం నేను గర్వపడే అంశాల్లో ఒకటి. ఇక ఆయనతో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించటం అంటారా..అది లైఫ్ టైమ్ ఎక్సపీరియన్స్. ఎందుకంటే ఆయన ఓ లెజండ్.

శంకర్ మళ్లీ ఆమెనే..

శంకర్ మళ్లీ ఆమెనే..

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ...ఐ సినిమా నిరాశపరిచినా శంకర్ మరోసారి ఆమెనే నమ్మడం ఆశ్చర్యంకలిగించే అంశమే. అయితే తన ఒంపుసొంపులతో అమీ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటన కనబరిస్తే పెద్ద హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతుందనేది నిజం.

ఇలా తినే అంత నాజూగ్గా

ఇలా తినే అంత నాజూగ్గా

ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ ఎప్పటికీ మిస్ అవ్వనని అది చాలా విలువైనదని తెలిపింది. గ్రీన్ జ్యుస్ - ఓట్స్ - తేనెలను తీసుకుంటానని ఇంటినుండి బయల్దేరేముందు లీటరు నీళ్ళు తప్పకుండా తాగుతానని తెలిపింది. అంతేకాక ఉదయపు ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సాయంత్రం 7 గంటలకు తర్వాత ఎలాంటి ఆహారమూ తీసుకోనని చెప్పింది. ఇలా చేయడం ద్వారానే నాజుగ్గా ఉన్నానని అమీ వెల్లడించింది.

రామ్ చరణ్ తర్వత మళ్లీ

రామ్ చరణ్ తర్వత మళ్లీ

‘ఎవడు' చిత్రంలో రామ్ చరణ్ సరసన కనిపించిన అమీ జాక్సన్.. ఆ తరువాత మరే తెలుగు చిత్రాల్లోనూ నటించలేదు. ఇప్పటి వరకు పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అమీ.. త్వరలోనే తెలుగులోనూ బిజీగా కానుందని సమాచారం. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటించడానికి.. పలువురు దర్శకనిర్మాతలతో ఈ బ్రిటిష్ బ్యూటీ చర్చలు జరుపుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమె త్వరలోనే తెలుగులోనూ బిజీ అయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు.

అమీని పెళ్లి చేసుకోవాలంటే..

అమీని పెళ్లి చేసుకోవాలంటే..

‘‘మంచి వ్యక్తిత్వం ఉన్నవాడికే నా తొలి ఓటు. అందం శాశ్వతం కాదు. వయసు ఆగిపోదు. కాలంతో పాటు ప్రతి ఒక్కరూ ముదిమిని అంగీకరించాల్సిందే. కానీ వ్యక్తిత్వం ఎప్పటికీ చెరిగిపోదు. మంచి వ్యక్తిత్వం గల వాళ్లు తమ ప్రతి చర్యలోనూ దాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. హాస్యచతురత ఉన్నవాళ్లన్నా నాకు బాగా ఇష్టం'' అని చెప్పుకొచ్చింది అమీ జాక్సన్‌.

వెనకాడదు

వెనకాడదు

కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఓ రౌండ్ చుట్టేసిన ఆ సుందరాంగి.. రేంజ్ పెరుగుతున్న కొద్దీ అంగాంగ ప్రదర్శనకు పెద్దపీట వేస్తోంది. ఇంతకూ ఎవరా సెక్సీ సుందరి అని అందరూ ఎంక్వైరీ చేసుకుని తమ సినిమాల్లో తీసుకునేలా రెచ్చిపోతోంది.

ఇక్కడ పాగా వేయటానికే..

ఇక్కడ పాగా వేయటానికే..

బ్రిటీష్ బ్యూటీనే అయినా అమీ జాక్సన్ మన పరిశ్రమలో బాగానే కలసిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ క్రమంగా బిజీగా మారుతున్న అమీ.. స్టార్ డమ్‌కు రీచ్ అవుతున్న కొద్దీ అందాలతో ఇండస్ట్రీని ఆకట్టుకునేందుకు, అభిమానులను అలరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

మరి మనకు అలాగే అనిపిస్తుంది

మరి మనకు అలాగే అనిపిస్తుంది

అమీ జాక్సన్ అనగానే ఆమె హాట్ హాట్ అందాలు.. క్లీవేజ్ షోలు.. మైండ్ బ్లోయింగ్ ఫొటో షూట్లే మనకు టక్కున గుర్తుకొస్తాయి. పుట్టింది పెరిగింది లండన్ లో కదా.. ఆమెకు ఇదంతా అంత బోల్డుగా అనిపించదు. మనకు మాత్రం డోస్ మరీఎక్కువలాగా అనిపిస్తుంది.

English summary
Amy Jackson's tryst with films began down South. Her next is an enviable project, where she shares the frame with Rajinikanth and Akshay Kumar. Amy gives us the lowdown on that.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu