పెళ్లి కాకుండానే గర్భవతి అయిన క్రేజీ హీరోయిన్.. అరచి మరీ చెప్పాలనిపిస్తోందట!

అందాల మెరుపు తీగ అమీ జాక్సన్ పలు చిత్రాల్లో దక్షణాది ఆడియన్స్ ని అలరించింది. ఈ బ్రిటిష్ సుందరి అందాలకు యువత ఫిదా అయిపోయారు. కానీ అమీ జాక్సన్ కు ఎక్కువ విజయాలు మాత్రం దక్కలేదు. అమీజాక్సన్ నటించిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో రూపొందించినవే. అమీ జాక్సన్ గత కొంత కాలంగా జార్జ్ పనయోటో అనే లండన్ వ్యాపారితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలోనే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలో ఈ జంట వివాహానికి సిద్ధం అవుతున్న తరుణంలో అమీ జాక్సన్ సంచలన విషయాన్ని ప్రకటించింది.

 భారీ చిత్రాల్లో

భారీ చిత్రాల్లో

మోడల్ గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ 2010లో మద్రాసు పట్నం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. అమీ జాక్సన్ క్యూట్ లుక్స్ అందరిని ఆకర్షించాయి. ఆ తర్వాత పలు హిందీ, తమిళ చిత్రాల్లో అమీ జాక్సన్ నటించింది. అమీ జాక్సన్ కు సరైన విజయాలు దక్కలేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శత్వంలో కూడా అమీ జాక్సన్ రెండు చిత్రాల్లో నటించింది. ఐ, 2.0 చిత్రాలు భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 తగ్గిన అవకాశాలు

తగ్గిన అవకాశాలు

అమీ జాక్సన్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు బాగా తగ్గాయి. అమీ జాక్సన్ చివరగా నటించిన చిత్రం 2.0. ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో అమీ జాక్సన్ బ్రిటన్ చెక్కేసింది. ప్రియుడితో గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది. అమీ జాక్సన్ వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా అమీ జాక్సన్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ న్యూస్ ప్రకటించింది.

 పెళ్లి కాకుండానే

పెళ్లి కాకుండానే

తాను గర్భవతి అయినట్లు అమీ జాక్సన్ సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా అమీ జాక్సన్, జార్జ్ నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఇంకా పెళ్లి కాలేదు. తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లంతా అమీ జాక్సన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అరచి మరీ చెప్పాలని

అమీజాక్సన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అందరికి ఈ విషయాన్ని గట్టిగా అరచి మరీ చెప్పాలనుకుంటున్నా. నేడు బ్రిటన్ లో మదర్స్ డే. ఈ విషయం చెప్పడానికి మాతృదినోత్సవానికి మించిన సమయం మరొకటి లేదు. తనకు పుట్టబోయే బిడ్డని ఉద్దేశిస్తూ.. నిన్ను చూడక ముందే ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టేశా. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా అని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో తనకు కాబోయో భర్తతో ఉన్న ఫోటోని షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X