రామ్‌చరణ్ సరసన ఎమీ జాక్సన్ ఖరారు
హిందీ ఏమి మాయ చేసావే రీమేక్ ఏక్ ధీవానా ధా లో జెస్సీ పాత్ర చేస్తున్న ఎమీ జాక్సన్..రామ్ చరణ్ సరసన ఎంపికైంది. ఎస్.వి.సి.పతాకంపై రామ్‌చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఎవడు' చిత్రం కోసం ఆమెను మరో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె తమిళ చిత్రం'మదరాసి పట్నం'తో పాపులరైంది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23 నుంచి జరుగనుంది. ఈ విషయాన్ని నిర్మాత మీడియాకు తెలియచేసారు. అలాగే.. " ఈ చిత్రం వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతుంది. మా సంస్థలో దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇది హ్యాట్రిక్ విజయం అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. యాక్షన్, వినోదం సమపాళ్ళలో ప్రేక్షకులకు అందిస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరు రవి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, నిర్మాత: రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications