Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఎవడు’ హీరోయిన్ ప్రియున్ని మార్చిందిరోయ్!
చెన్నై : 'ఎవడు' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఎమీ జాక్సన్ గతంలో పలువురితో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. తాజాగా అమ్మడు ప్రియున్ని మార్చినట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేసే విధంగా తన ట్విట్టర్లో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ ఫోటో...
ఆ ఫోటోలో చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధం ఉందని స్పష్టం అవుతోంది. ఎమీ జాక్సన్ అతని ఒడిలో కూర్చుని ముద్దు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు ఆ ఫోటోలో ఉంది. అంతే కాదు అతన్ని 'My baby T'గా పేర్కొంది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ఏరేంజిలో ఎఫైర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే....ఈ ఫోటో ఎమీ జాక్సన్ ఫన్నీగా పోస్టు చేసిందా? లేక వీరిద్దరి మధ్య సీరియస్ రిలేషన్షిప్ ఉందా? అది కేవలం స్నేహమా? లేక ప్రేమ బంధమా? అనేది ఖరారు కావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఫోటో పోస్టు చేసిన తర్వాత ఎమీ మీడియాలో చర్చనీయాంశం అయింది. గతంలో ఎమీ జాక్సన్ బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్‌తో కొంతకాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా...ఎమీ జాక్సన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం 'ఐ' షూటింగులో బిజీగా గడుపుతోంది. అదే విధంగా ఆమె నటించిన తెలుగు చిత్రం 'ఎవడు' ఈ నెల చివరి వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది. మరి తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఎమీ జాక్సన్ ప్రేక్షకులను ఏమేరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి.