అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్, కోటీశ్వరుడైన బాయ్‌ఫ్రెండ్‌తో త్వరలో పెళ్లి (ఫోటోస్)

Recommended Video

Amy Jackson Gets Engaged To Her Boy Friend George Panayiotou On Jan 1

హీరోయిన్ అమీ జాక్సన్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. కొంతకాలంగా ఆమె తన సొంత దేశమైన బ్రిటన్‌కు చెందిన బాయ్ ఫ్రెండ్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో మునిగి తేలుతున్నారు. నూతన సంవత్సరం వేళ ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. జనవరి 1, 2019న జాంబియాలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.

ఈ విషయాన్ని అమీ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ... జార్జ్ పనాయొటోతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. కొత్త సంవత్సరం వేళ మా ఇద్దరి కొత్త జీవితం ప్రారంభం అయిందని తెలిపారు.

లైఫ్‌లో కొత్త అడ్వంచర్

లైఫ్‌లో కొత్త అడ్వంచర్

మా జీవితంలో కొత్త అడ్వంచర్ మొదలైంది. నన్ను ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ హ్యాపీయెస్ట్‌గా ఉంచే వ్యక్తితో నా ప్రయాణం మొదలైందని అమీ జాక్సన్ పేర్కొన్నారు.

ఇద్దరూ కలిసి సహజీవనం

ఇద్దరూ కలిసి సహజీవనం

అమీ జాక్సన్ ఇటీవలే కొత్త ఇంట్లోకి మారారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ ఇంట్లోనే జరుపుకున్నారు. ఈ సందర్భంగా జార్జ్‌ను ముద్దాడుతున్న ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ ఇదే ఇంట్లో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జార్జ్ పనాయొటో

జార్జ్ పనాయొటో

అమీ జాక్సన్ పెళ్లాడబోతున్న జార్జ్‌ పనయొటో యూకెలో ధనవంతుడైన బ్రిటిష్ ప్రాపర్టీ డెవలపర్ ఆడ్రియాస్ కుమారుడు. వీరికి యూకెలో చాలా లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. జార్జ్‌‌ను ఇంగ్లిష్ మీడియా మల్టీ మిలియనీర్ ప్లేబోయ్ అని సంబోధిస్తుండటం గమనార్హం.

అమీ జాక్సన్

అమీ జాక్సన్

ఎఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘మద్రాసపట్టణం' సినిమాతో ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన అమీ జాక్సన్... తెలుగులో ‘ఎవడు' చిత్రంలో నటించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ', ‘2.0' చిత్రాలు అమీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X