చరణ్ ‘ఎవడు’ షూటింగులో చేరిన బ్రిటన్ భామ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా...బ్రిటన్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఈ రోజు నుంచి ఆమె ఈ చిత్రం షూటింగులో పాల్గొనబోతోంది.
ఈ మేరకు అమీ నిన్న తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన సందేశాన్ని పోస్టు చేసింది. 'రెండు నెలల ముంబై నుంచి దూరం వెలుతున్నా. ఎవడు చిత్రం షూటింగులో పాల్గొనబోతున్నా. అన్ని ప్యాక్ చేసుకున్నాను. నన్ను హైదరాబాద్ పిలుస్తోంది.' అంటూ ట్విట్ చేసింది.
రామ్ చరణ్‌తో తొలి సినిమా కావడంతో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే బృందావనం చిత్రంతో హిట్ కొట్టిన వంశీ పైడి పల్లి పక్కా ఎంటర్‌టైన్మెంట్ సబ్జెక్టుతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ ముఖ్య పాత్రలో కనపించబోతున్నాడు.
దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక 'ఎవడు' చిత్రంలో డైలాగు అంటూ ఒకటి ఇప్పుడు నెట్ లోకంలో ఇప్పటిరకే బాగా పాపులర్ అయ్యిందిది. అదేమిటంటే..."నా దగ్గర ఏముందో నాకు తేలుసు...నేను అదే చెప్తున్నా...నీ దగ్గర లేనిది ఉందంటే మాత్రం ..ఇంకేమీ చెప్పను...గుడ్డలు ఊడదీస్తా..". ఈ డైలాగుని విలన్ తో హీరో అంటాడని చెప్తున్నారు. ఇక ఈ డైలాగు ని రామ్ చరణ్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











