»   » బికినీ, బ్రా లో అమీ జాక్సన్ (హాట్ ఫొటో)

బికినీ, బ్రా లో అమీ జాక్సన్ (హాట్ ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శంకర్, విక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన 'ఐ' చిత్రంలో నటించిన అమీ జాక్సన్ ని ఒక పట్టాన మర్చిపోలేం. ఈ బ్యూటీ తన అందాలతో వెండితెరని వేడిక్కించింది. తాజాగా మరోసారి ఇలా బికినీ వేసి తన ఫ్యాన్స్ కు పండుగ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు ఆమె అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ చేసి,కామెంట్స్ చేస్తున్నారు.

https://www.facebook.com/TeluguFilmibeat

అమీ జాక్సన్ మాట్లాడుతూ....చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేనాటికి నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా ఓ తెగ కంగారు పడిపోయేదాన్ని. గాసిప్పులు సాధారణం అని తెలిసినా తట్టుకోలేకపోయేదాన్ని. మరి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ధైర్యం వచ్చేసింది అంటోంది అమీ జాక్సన్‌. ఇటీవల ఈమె నటించిన 'ఐ' చిత్రం విడుదలైంది. అమీ కెరీర్‌ తొలినాళ్లలో గాసిప్పులంటే బాగా భయపడేదట.

Amy Jackson offering bikini treat!

అమీ మాట్లాడుతూ ''19 ఏళ్ల వయసులో ఉండగా 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అప్పుడు నాకు పరిశ్రమలో తెలిసివాళ్లు అంతగా లేరు. నాపై మీడియాలో ఏ చిన్న పుకారు వచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాను'' అని చెప్పింది.

బాలీవుడ్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ''గౌతమ్‌ మీనన్‌తో పనిచేయాలనే ఉద్దేశంతోనే 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాను. ఆ సినిమా తమిళ మాతృక సూపర్‌ హిట్‌. దక్షిణాది సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యుంటే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మరింత ఎక్కువగా వచ్చుండేవేమో. ఏదైనా చివరకు భారతీయ సినిమాలో నటించడమే కదా''అని చెప్పింది అమీ.


‘ఐ' విషయానికి వస్తే...

ఈ చిత్రంలోని మేకప్‌ ఆర్టిస్ట్‌ ఒజాస్‌ ఎం. రజనీ పాత్రను శంకర్‌ తీర్చిదిద్దిన విధానం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పాపులర్‌ ట్రాన్స్‌జెండర్‌ (లింగమార్పిడి) టీవీ పర్సనాలిటీ రోస్‌ వెంకటేశన్‌ తెలిపారు. విక్రమ్‌, ఎమీ జాక్సన్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ' ఇటీవల విడుదలైంది.


ఈ సినిమా గురించి రోస్‌ మాట్లాడుతూ ‘‘ఒజాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలి. ఈ సన్నివేశాలు మమ్మల్ని కించపరిచేలా ఉన్నాయి. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. చట్టపరంగా ముందుకు సాగుతాం. దీని గురించి లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌ (ఎల్‌జీబీటీ) వర్గాలతో మాట్లాడి తదుపరి చర్యలను చేపడతాం'' అని తెలిపారు. చెన్నైలోని శంకర్‌ గృహం ముందు ట్రాన్స్‌జెండర్లు నిరసనలు వ్యక్తం చేశారు.

English summary
Amy Jackson donned a skimpier bikini bra with bikini lingerie that pressed her measures in a way that guys go envious.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu