»   » బాహుబలి సరసన బ్రిటీష్ భామ: అమీజాక్సన్ బుక్కయ్యింది

బాహుబలి సరసన బ్రిటీష్ భామ: అమీజాక్సన్ బుక్కయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

''నేను ప్రభాస్ పక్కన ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను. చేయడానికి రెడీగా ఉన్నా" అంటూ ఆమధ్య చెప్పిన బ్రిటీష్ భామ అమీ జాక్సన్ కోరిక త్వరలోనే నెరవేర బోతోంది. ప్రభాస్ హీరోగా సుజిత్ చేయబోయే చిత్రం లో అమీ ని హీరోయింగా ఎంపిక చేసుకున్నారట. అప్పుడెప్పుడో మద్రాసిపట్టణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీ జాక్సన్..

తెలుగులో మాత్రం ''ఎవడు'' సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆమె బికినీ లుక్ కు అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఆ తరువాత ఆమీ తెలుగు సినిమాలు చేద్దామని అనుకున్నా.. శంకర్ 'ఐ' కారణంగా చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ డైరక్టర్ తో 'రోబో 2.0' సినిమా చేస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు ఏమీ లేకపోయినా.. ఒక సినిమా ఛాన్సు అయినా రాకపోతుందా అని ఎదురు చూసింది. ఇప్పుడు ఆ కోరిక తీరేలానే ఉంది

Prabhas

బ్రిటిష్ బ్యూటీ ఏమీ జాక్సన్ కు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వెళ్లినట్టు సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ను ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం 'బాహుబలి 2' చిత్రం షూటింగుతో బిజీగా వున్న ప్రభాస్ దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రియురాలిగా ఎమీ జాక్సన్ ను ఎంచుకున్నట్టు, అందుకు ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం.

English summary
Amy Jackson got a call to Share Screen With Prabhas in his new Movie wich is directing by Sujuth
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu