ప్రియుడితో ఘాటు సరసం.. మరీ ఓపెన్‌గా.. వైరల్ అవుతున్న పాపులర్ హీరోయిన్ రొమాన్స్

Recommended Video

Amy Jackson Latest Photo Goes Viral || Filmibeat Telugu

ఈ రోజుల్లో రొమాన్స్ పట్ల ఫుల్ ఓపెన్ గా ఉంటున్నారు హీరోయిన్స్. డేటింగ్, రొమాంటిక్ మూడ్స్, బ్రేకప్ లాంటి విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు. బాలీవుడ్ భామల్లో అయితే ఇది మరీ ఎక్కువ. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మొదలుకొని బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ వరకూ అందరూ తన నిజమైన హాట్ రొమాన్స్‌ని అందరి ముందుంచుతున్నారు. ఈ కోవ లోనే తాజాగా అమీ జాక్సన్ తన ప్రియుడితో దిగిన రొమాంటిక్ పిక్ షేర్ చేసి కుర్రకారుకు మైకం తెప్పించింది.

ఎంతైనా ఇంగ్లీష్ పిల్ల కదా!

ఎంతైనా ఇంగ్లీష్ పిల్ల కదా!

అమీ జాక్సన్ ముందు నుంచే ఏ విషయంలో అయినా ఓపెన్ గా ఉంటూ వస్తోంది. అందాన్ని ఆరబోయడమైనా, ప్రియుడితో రొమాన్స్, డేటింగ్ విషయాలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఇంగ్లీష్ పిల్ల అనిపించుకుంటోంది. అయితే ఇటీవలే గర్భం దాల్చిన ఈ భామ తన ప్రియుడితో కలిసి హాట్ హాట్‌గా రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పిక్ షేర్ చేయడం చర్చనీయాంశం అయింది.

కాబోయే భర్తతో ఘాటు రొమాన్స్ చేస్తూ

కాబోయే భర్తతో ఘాటు రొమాన్స్ చేస్తూ

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అమీ.. ఈ రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ కాబోయే భర్తను ఉద్దేశించి కామెంట్ కూడా చేసింది. ''లైఫ్‌లో ఎక్కువగా నేను నమ్ముతున్నది ఒక్కటే.. నువ్వు అద్భుతమైన నాన్నవి అవుతావని. ఫ్యూచర్‌లో రాబోయే ఫాదర్స్ డేకు ఇదే ప్రారంభం. హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే. మేము నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ కాబోయే వాడిని యమ కూల్ చేస్తూ అట్రాక్ట్ చేసింది అమీ జాక్సన్.

ముద్దుల మైకంలో మునిగిపోయారు

తాజాగా అమీ షేర్ చేసిన ఈ రొమాంటిక్ పిక్ చూస్తుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ముద్దుల మైకంలో మునిగిపోయిన ఈ ప్రేమికులు ప్రపంచాన్ని పట్టించుకునేలా లేరు అని. ఇక ఇందులో అమీ సెక్సీగా కనిపిస్తుండగా, ఆమె ప్రియుడు జార్జ్‌ పనాయొటో మాంచి మూడ్‌లో ఎంజాయ్ చేస్తూ దర్శనమిస్తున్నాడు. ఇలా ఈ ఇద్దరినీ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా! చెప్పండి.. తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో హాయిగా

ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో హాయిగా

ప్రస్తుతం మొరాకో దేశంలోని లా మెమోనియా మెరాకెచ్ అనే ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో హాయిగా సేదదీరుతోంది అమీ జాక్సన్. ప్రియుడు, కాబోయే భర్త ప్రియుడు జార్జ్‌ పనాయొటోతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మధ్య మధ్యలో అక్కడ దిగిన పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియా టచ్ ఇస్తోంది. ఈ మేరకు ఇదివరకే తన బేబీ బంప్‌తో పలు ఫోటోలు షేర్ చేసి ఆశ్చర్యపర్చింది అమీ.

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్

ప్రియుడు జార్జ్‌ పనాయొటో చెట్టాపట్టాలేసుకు తిరిగి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది రోబో భామ అమీ జాక్సన్. అంతటితో ఆగక తాను పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత ఆ ప్రియుడితోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. బహుశా సంతానం కలిగాక పెళ్లి చేసుకుంటారేమో! ఎంతైనా మోడ్రెన్ బేబీ కదా మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X