»   » వైట్ బికినీలో శృంగార దేవతలా ఉంది (ఫోటో)

వైట్ బికినీలో శృంగార దేవతలా ఉంది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమీ జాక్సన్ ‘ఐ' సినిమా తర్వాత తన మార్కెట్ విస్తరించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మోడలింగ్ రంగం నుండి వచ్చిన అమీ జాక్సన్ తన అందాలే పెట్టుబడిగా దూసుకెలుతోంది. వరుసగా హాట్ ఫోటోలతో ఇండియన్ సినీ జనాలను ఊరిస్తోంది. ఇటీవలే ఓ మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చిన అమీ జాక్సన్...తాజాగా వైట్ బికినీలో శృంగార దేవతలా దర్శనమిచ్చింది. కుర్రకారు మతిపోగొట్టేలా ఉన్న ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.

బ్రిటన్ కు చెందిన మోడల్ అయిన అమీ జాక్సన్ అనతి కాలంలోనే కెరీర్ పరంగా ఎదిగింది. 16 ఏళ్ల ప్రాయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన అమీ జాక్సన్ ‘మిస్ టీన్ లివర్ పూల్', ‘మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ పెజెంట్స్', ‘మిస్ టీన్ వరల్డ్' అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డులను గెలుచుకున్న తర్వాత ఆమె 2010లో మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

Amy Jackson's Bikini Treat

ఇదే సంవత్సరం ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ చిత్రం మద్రాసి పట్టణం చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. ఇలా ఆమె ఇండియన్ సినిమా పరిశ్రమ బాట పట్టింది. తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. 2012లో ‘ఏక్ దివానా థా' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రతీక్ బబ్బర్ తో ప్రేమాయణం నడిపి వార్తల్లోకి ఎక్కింది.

ఇండియన్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అమీ జాక్సన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు మరింత పెరిగాయి. ప్రముఖ మేగజైన్లు ఆమె అందాలు తమ మేగజైన్‌పై ఆరబోయించడానికి పోటీ పడుతున్నాయి.

English summary
Amy Jackson shows off the body that made her a Bollywood superstar as she poses in white underwear in steamy photo shoot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu