»   » ఇలా చేస్తే అమీ జాక్సన్ అభిమానులు ఏమైపోవాలి..ఈ కఠిన నిర్ణయం ఎందుకు?

ఇలా చేస్తే అమీ జాక్సన్ అభిమానులు ఏమైపోవాలి..ఈ కఠిన నిర్ణయం ఎందుకు?

Subscribe to Filmibeat Telugu
Amy Jackson Going Get Settled In Africa

పాలరాతి శిల్పంలా ఉండే రూపం, యువతని మత్తెక్కించే చూపులు తెల్లతోలు పిల్ల అమీజాక్సన్ సొంతం. మోడల్ గా రాణిస్తున్న సమయంలో ఈ బ్రిటిష్ సుందరి తమిళంలో వచ్చిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. తమిళ, తెలుగు భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నటించింది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు నటించే ఛాన్స్ కొట్టేసింది. అమీజాక్సన్ అందాలకు భారీగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో అమీ ఘాటు అందాలతో చెలరేగుతున సంగతి తెలిసిందే. కాగా తాజాగా అమీజాక్సన్ తన అభిమానులని నిరాశ పరిచే విధంగా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

తమిళ చిత్రంతో ఎంట్రీ

తమిళ చిత్రంతో ఎంట్రీ

అమీ జాక్సన్ మోడల్ గా రాణిస్తున్న సమయంలో మదరాసు పట్టణం అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది అమీ జాక్సన్.

శంకర్ దర్శకత్వంలో

శంకర్ దర్శకత్వంలో

తక్కువ సమయంలోనే అమీజాక్సన్ కు శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. విక్రంతో కలసి నటించిన ఐ చిత్రం నిరాశ పరిచినప్పటికీ అమీ జాక్సన్ కు అవకాశాలు వచ్చాయి. అమీ జాక్సన్ బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో మెరిసింది.

యువతకు మత్తెక్కించేలా

యువతకు మత్తెక్కించేలా

యువతకు మత్తెక్కించేలా గ్లామర్ షోలో రెచ్చిపోవడం అమీ జాక్సన్ కు బాగా తెలుసు. అమీ జాక్సన్ అందాలు అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు.

ఆడ రోబోగా రాబోతోంది

ఆడ రోబోగా రాబోతోంది

అమీజాక్సన్ ప్రస్తుతం తన ఆశలన్నీ రజినీకాంత్ సరసన, శంకర్ దర్శకత్వంలో రెండవ సారి నటిస్తున్న 2.ఓ చిత్రంపైనే ఉన్నాయి.

షాకింగ్ డెసిషన్

షాకింగ్ డెసిషన్

అమీ జాక్సన్ ఓ కఠిన నిర్ణయం తీసుకుందటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమీ జాక్సన్ ఇక భారతీయ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందట. అందం అభినయం అని ఉన్నప్పటికీ అవకాశాలు ఆశించితిన్ స్థాయిలో రాకపోవడం, ఆశలు పెట్టుకున్న 2.ఓ చిత్రం తరచుగా వాయిదా పడుతుండడంతో అమీ నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆఫ్రికాలో సెటిల్ కావాలని

ఆఫ్రికాలో సెటిల్ కావాలని


ఇండియన్ సినిమాకు గుడ్ బై చెప్పి ఆఫ్రికాలోని మొరాకోలో సెటిల్ కావాలని అమీజాక్సన్ ఇటీవల చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమో అమీజాక్సన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

English summary
Amy Jackson sensational decision on Indian movies. She wants to settle in Africa
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X