'మాగ్జిమం' కవర్ పై హాట్ గా చరణ్ హీరోయిన్
త్వరలో తెలుగు తెరపై రామ్ చరణ్ సరసన అందాలు ప్రదర్శించనున్న ఎమీ జాక్సన్ తాజాగా మాగ్జమం పత్రిక కవర్ పేజీపై దర్శనమిచ్చింది. బ్లాక్ బికిని టాప్, యల్లో షార్ట్ తో ఆమె అన్ బటన్ డ్ వైట్ షర్ట్ వేసుకుని అలరించింది. ఈ ఫోటోలో ఆమె చాలా హాట్ గా ఉండి.. స్పైసీ లుక్స్ తో అందరినీ ఆకర్షిస్తోంది. పెద్ద బ్యానర్స్ తన వైపు చూడాలంటే ఈ మాత్రం ప్రదర్శన తప్పదని ఈ బ్యూటీ భావించి ఇలా ఫోటోలో కనపించింది.
ఇక ఆమె ప్రస్తుతం బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉంది. ఆ రిలేషన్ నే ఇప్పుడు సహ జీవనంగా మార్చుకుని ఇద్దరూ కంటిన్యూ అవుతున్నట్లు చెప్తున్నారు. ముంబై బాంద్రాలోని ఎమీ ఇంట్లోనే వీరిద్దరూ కాపురం పెట్టినట్లు చెప్తున్నారు. వీరిద్దరూ తెలుగులో హిట్టైన ఏమి మాయ చేసావే హిందీ రీమేక్ లో చేసారు. అప్పుడు ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది.
తెలుగులో కెరీర్ విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఎవడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. తొలి సారిగా చెర్రీ, బన్నీ కలిసి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బన్నీ నటించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటాయంటున్నారు.
'జగదేకవీరుడు-అతిలోక సుందరి'లోని పాపులర్ సాంగ్ 'అబ్బనీ తియ్యనీ దెబ్బ..'మర్చిపోని వారు ఉండరు. ఇప్పుడా పాటని ఈ చిత్రంలో రీమిక్స్ చేయబోతున్నారు. ఇక ఆ మధ్యన మొదలైన ఈ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ క్రిందట నెల 27నుంచి మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తారు. 'జంజీర్' సినిమా షూటింగ్ బిజీలో ఉన్న చరణ్, 30వ తేదీ నుంచి 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆరోజు నుంచి సమంతా,రామ్ చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











