For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చూస్తూనే ఉండిపోతారు: బికినీలో అందాల విందు(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ :ఈ కాలం సినిమాల్లో హీరోయిన్ల బికినీల ప్రదర్శన సర్వ సాధరణమైంది. ఒకప్పుడు హీరోయిన్ల అందాలను పైపైనే చూపించే వారు. కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారింది. పై పై అందాలతో ప్రేక్షకులు సంతృప్తి పడటం లేదు. అందుకే దర్శకులు కూడా వారి అభిరుచికి తగిన విధంగానే హీరోయిన్ల అందాల ఆరబోతను సినిమాలో ఒక ప్రధానమైన భాగం చేసారు. మరి హీరోయిన్స్ కూడా ఇలాగ ప్రత్యేకంగా ఫోటో షూట్స్ చేయించుకుని మరీ దర్శక,నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  ఇప్పుడు రామ్ చరణ్ తో ఎవడు చిత్రంలో చేసిన అమీ జాక్సన్ వంతు వచ్చింది. ఆమె ప్రత్యేకంగా బికినీ లో ఫొటో షూట్ చేయించుకుంది. ఆ స్టిల్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. నెట్ లో ఈ ఫోటో వైరల్ గా దూసుకుపోతున్నాయి.

  ఇక బికినీలో హీరోయిన్స్ కనిపించటం వింతేమీ కాదు. సినిమా ఫీల్డ్ పుట్టిన నాటి నుంచి ఎంతో మంది కనిపించారు.అయితే కొందరు మాత్రం బికినీలో అదరకొడతారు. వారి గురించే జనం మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా తన గురించి మాట్లాడుకుంటారు అంటోంది అమీ.

  స్లైడ్ షో లో బికినీ ఫొటోలు...

  ఇంతకీ ఎవరీ అమీ?

  ఇంతకీ ఎవరీ అమీ?

  శంకర్ ఐ మూవీ టీజర్ వచ్చినప్పటి నుంచి అమీ జాక్సన్ హాట్ టాపిక్ అయిపోయింది. కవర్ పేజీలు, టు పీస్ బికినీ ఫొటోలు, మసాజ్ వీడియోలతో హల్ చల్ చేస్తోంది.

  ఆమె పర్శనల్...,

  ఆమె పర్శనల్...,

  పూర్తి పేరు:అమీ జాక్సన్

  తల్లిదండ్రులు:అలెన్ జాక్సన్, మార్గరీటా

  పుట్టిన తేదీ:జనవరి 31, 1991

  ఎత్తు:5.7 అడుగులు

  చదువు, వృత్తి

  చదువు, వృత్తి

  చదువు:సెయింట్ ఎడ్వర్డ్ కాలేజ్

  దేశం:బ్రిటన్

  కెరీర్:మోడలింగ్

  అవార్డ్స్

  అవార్డ్స్

  2009-మిస్ టీన్ వరల్డ్,

  2010-మిస్ లివర్‌పూల్

  కెరీర్ ప్రారంభంలోనే ఆమె అవార్డులు అందుకుంది

  సినిమాలు...

  సినిమాలు...

  మొదటి సినిమా:మదరాసీపట్టణం (తమిళ్ సినిమా,2010)

  రెండోది:ఎవడు(తెలుగు సినిమా)

  బాలీవుడ్:ఏక్ దివానా థా

  పర్శనల్ టేస్ట్...

  పర్శనల్ టేస్ట్...

  ఇష్టమైన ఆహారం:అరటి పండు

  ఫిట్‌నెస్‌లోఆదర్శం:మానే పాక్వియో

  ఇష్టమైన నటుడు:డెవిడ్ బెక్‌హమ్

  నటి:బిపాస బసు

  దెయ్యంగా చేస్తోంది...

  దెయ్యంగా చేస్తోంది...

  ప్రస్తుతం సౌత్‌లో హారర్ కామెడీ , హారర్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దాంతో దర్శక, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు కూడా ఇలాంటి చిత్రాలకు ఓటు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే ఓ చిత్రం రెడీ అవుతోంది. అందులో రామ్‌చరణ్ సరసన ఎవడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్.. దెయ్యంగా నటిస్తోందని సమాచారం.

  ఎదురుచూపు...

  ఎదురుచూపు...

  ఇప్పటి వరకు వినూత్నమైన చిత్రాలతో హీరోగా పేరుతెచుకున్న తమిళ హీరో సూర్య తొలిసారి ఈ హారర్ చిత్రంలో నటిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితుడే అయినా.. హారర్ చిత్రంలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. అందాల అమీజాక్సన్ దెయ్యంలా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

  అలా స్ధిర పడింది..

  అలా స్ధిర పడింది..

  'మదరాస పట్టనమ్' అనే సినిమాకి అవకాశం రావడంతో ఇండియా వచ్చిన అమీ, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ, ఇక్కడే స్థిరపడ్డారు.

  ప్రేమాయణం

  ప్రేమాయణం

  'ప్రేమ ఎంత మధురం...' అంటూ బ్రిటిష్ భామ అమీ జాక్సన్ ప్రణయ గీతాలు ఆలపిస్తున్నారు. బుల్లితెర నటుడు ర్యాన్ థామస్‌కి అమీ మనసిచ్చారట.

  అప్పుడే పరిచయం..

  అప్పుడే పరిచయం..

  నాలుగేళ్ల క్రితం 'మిస్ ఇంగ్లాండ్' పోటీలో పాల్గొన్నప్పుడు ర్యాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందట. ఆ కార్యక్రమానికి ర్యాన్ ఓ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

  ఇది లవ్వే..కన్ఫర్మ్

  ఇది లవ్వే..కన్ఫర్మ్

  అప్పట్నుంచీ అడపా దడపా కలుసుకుంటున్న అమీ, ర్యాన్ ఇటీవలే తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే కాదు.. అంతకు మించింది ఏదో ఉందని గ్రహించారట. ఈ ప్రేమ ప్రయాణాన్ని జోరుగా సాగించడం పలువురి దృష్టిలో పడింది.

  ట్విట్టర్ ద్వారా అందరికీ..

  ట్విట్టర్ ద్వారా అందరికీ..

  అలాగే, ర్యాన్‌తో తను పార్టీ చేసుకున్న రెండు మూడు ఫొటోలను అమీ ట్విట్టర్‌లో పెట్టడంతో ఇక, ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు మొదలయ్యాయి. దాంతో అసలు ఎవరీ ర్యాన్ అని ఇక్కడివాళ్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

  అతనో వివాహితుడు..

  అతనో వివాహితుడు..

  ఒకప్పుడు 'సెక్సియస్ట్ మేన్'గా నామినేట్ అయ్యారని, ఆయనకు ఆల్‌రెడీ పెళ్లయ్యిందని, ఓ కూతురు కూడా ఉందని ఇలా ర్యాన్ జీవితం గురించి తెలుసుకున్న తర్వాతే ఔత్సాహికరాయుళ్ల ఆరాటం తగ్గింది.

  ఎదురుచూస్తోంది..

  ఎదురుచూస్తోంది..

  ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో విక్రమ్ హీరోగా చేస్తున్న ‘మనోహరుడు' సినిమా లో అమీ హీరోయిన్. ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.

  ఆఫర్స్ కోసమేనా...

  ఆఫర్స్ కోసమేనా...

  ఈ ప్రత్యేకమైన ఫొటో షూట్ ఆమె బాలీవుడ్ లో ఆఫర్స్ సంపాదించటానికే అంటున్నారు. అందుకోసమే ఈ అందాల ప్రదర్శన అని చెప్తున్నారు.

  కొత్తేం కాదు..

  కొత్తేం కాదు..

  అమీకు బికినీలో కనిపించటం కొత్తేం కాదు. ఎవడు సినిమాలో సైతం ఆమె బికినీలో కనిపించి అలరించింది. దాంతో ఈ ఫొటో షూట్ రెగ్యులర్ గా కాకుండా భిన్నంగా ప్రయత్నించిందని చెప్తున్నారు.

  English summary
  Amy Jackson become hot topic with her latest Bikini Photo Shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X