»   » టీవీ యాక్టర్‌తో మెగా హీరోయిన్ డేటింగ్, రాత్రంతా...?

టీవీ యాక్టర్‌తో మెగా హీరోయిన్ డేటింగ్, రాత్రంతా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'ఎవడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భామ ఓ టీవీ యార్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బ్రిటిష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బ్రిటిష్ టీవీ స్టార్ ర్యాన్ థామస్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ టీవీ ఛానల్ ఐటీవీలో ప్రసారం అవుతున్న 'కోరోనేషన్ స్ట్రీట్' అనే హిట్ షోలో ర్యాన్ థామస్ నటిస్తున్నాడు. ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా పరిచయం ఉంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ప్రస్తుతం ఇద్దరూ డేటింగులో ఉన్నారని తెలుస్తోంది.

Amy Jackson Spotted On Night Out With Ryan Thomas

ఇటీవల లండన్ వెళ్లిన అమీ జాక్సన్....తన ప్రియుడితో కలిసి రాత్రంతా గడిపినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఈ సంఘటనతో ఇద్దరు డేటింగులో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. మరి ఇద్దరి ఈ సంబంధం ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.

అమీ జాక్సన్ గురించి విషయాల్లోకి వెళితే...చదువు పూర్తయిన తర్వాత మెడలింగును కెరీర్‌గా ఎంచుకున్న అమీ జాక్సన్ 2009లో మిస్ టీన్ వరల్డ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2010లో జరిగిన మిస్ లివర్ పూల్ పోటీల్లో పాల్గొంది. ఇందులో 18 బహుమతులు గెలుపొందింది. ఇందులో 50వేల డాలర్ల మోడలింగ్ కాంట్రాక్ట్ స్కాలర్ షిప్ కూడా ఉంది. తర్వాత బాస్ మోడల్ మేనేజ్మెంట్ సంస్థతో రెండో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. యూరఫ్ అంతటా మెడలింగ్ చేసింది.

2010లో తమిళ చిత్రం 'మద్రాసపట్టణం' ద్వారా నటింగా మారింది. 2012లో 'ఏక్ దివానా థా' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2013లో 'ఎవడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఐ' చిత్రంలో నటిస్తోంది.

English summary
British model-turned-actress Amy Jackson, who forayed into Tollywood with Ram Charan Teja's Yevadu, is reportedly dating British TV star Ryan Thomas, who is best known for playing the character Jason Grimshaw on ITV's hit show Coronation Street. The actress was recently spotted on night out with the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu