పెళ్లి తర్వాత సినిమాలకు దూరం.. హీరోయిన్ పెళ్లి ఎక్కడ జరగబోతోందో తెలుసా!
అందాల మెరుపు తీగ అమీ జాక్సన్ పలు చిత్రాల్లో దక్షణాది ఆడియన్స్ ని అలరించింది. ఈ బ్రిటిష్ సుందరి అందాలకు యువత ఫిదా అయిపోయారు. కానీ అమీ జాక్సన్ కు స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. అమీజాక్సన్ నటించిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో రూపొందించినవే. అమీ జాక్సన్ గత కొంత కాలంగా జార్జ్ పనయోటో అనే లండన్ వ్యాపారితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది సందర్భంగా అమీ జాక్సన్ తన ఎంగేజ్ మెంట్ గురించి ప్రకటించింది. అమీ జాక్సన్ వివాహానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

గ్రీక్ సంప్రదాయాల్లో
అమీ జాక్సన్, జార్జ్ వివాహం ఈ ఏడాది జరగబోతోంది. మరి కొన్ని నెలల్లోనే ఈ జంట వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా ఆల్రెడీ పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. అమీ జాక్సన్ వివాహం గ్రీస్ దేశంలో జరగబోతోందట. గ్రీకు సంప్రదాయంలో జరిగే వెడ్డింగ్ తో అమీ, జార్జ్ ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి వేదిక కోసం ముందుగానే గ్రీస్ లోని మైకోనాస్ ఐలాండ్ లో భారీ విల్లాని బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో
వివాహానంతరం అమీజాక్సన్ సినిమాలకు పూర్తిగా దూరం కానుంది. అమీ జాక్సన్, జార్జ్ ఇద్దరూ పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జార్జ్ తన వ్యాపారాలని అమెరికాకు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ కు కావలసిన అన్ని క్వాలిటీలు అమీ జాక్సన్ కు ఉన్నాయి. కానీ అమీ జాక్సన్ కెరీర్ ని మార్చేంత భారీ విజయం ఆమెకు దక్కలేదు.

తెలుగు, తమిళ చిత్రాల్లో
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శత్వంలో రెండు సార్లు నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా ఐ చిత్రంలో అవకాశం దక్కించుకున్న ఈ బ్రిటిష్ బ్యూటీ ఆ తర్వాత 2.0 చిత్రంలో నటించింది. ఐ చిత్రం నిరాశపరిచినప్పటికీ శంకర్ ఏరికోరి 2.0 చిత్రానికి అమీ జాక్సన్ నే ఎంపిక చేసుకున్నాడు. తెలుగులో అభినేత్రి, ఎవడు లాంటి చిత్రాల్లో కూడా నటించింది.

సోషల్ మీడియాలో క్రేజ్
ఇక అమీ జాక్సన్ కు సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ ఉంది. మిలియన్ల మంది అభిమానులు అమీ జాక్సన్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్, ప్రైవేట్ ఫోటోలని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు, అభిమానులకు అమీ జాక్సన్ పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











