చెత్త మూవీ అయితే ఎందుకు ఆదరిస్తారు?...‘ఐ’పై విక్రమ్
హైదరాబాద్: విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఐ' సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు.....క్రిటిక్స్ అంతా తమ రివ్యూల్లో యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. మరో వైపు ప్రేక్షకుల నుండి మాత్రం సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. వసూళ్లు కూడా బాగానే సాధిస్తోంది.
సినిమా ఫలితాలపై విక్రమ్ స్పందిస్తూ... "సగటు ప్రేక్షకుడు సినిమా బావుందని అంటున్నారు. క్రిటిక్స్, సినిమా పరిశ్రమకు చెందినవాళ్ల స్పందన వేరే విధంగా ఉంది. ఆదరణ బావుండటం వల్లనే రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఇది చెత్త సినిమా అయితే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారు?. శంకర్ సినిమాలో సందేశం లేదంటున్నారు. కానీ, ప్రేమకు అందంతో పని లేదన్నది సందేశమే కదా. అయినా ప్రతి సినిమాలోనూ సందేశం ఉండాలంటే ఎలా? వినోదమే ప్రధానంగా ‘ఐ' సినిమా తెరకెక్కింది అన్నారు.

ఈ చిత్రంలో బాడీ బిల్డర్‌గా, మోడల్‌గా, గూనివాడిగా కనిపించడానికి....తన శరీరంలో వివిధ రకాల మార్పులు తేవడానికి చాలా కష్టపడ్డట్లు విక్రమ్ చెప్పుకొచ్చారు. కేవలం ఐదు నెలల్లోనే బాడీ బిల్డింగ్ చేసాను. మామూలుగా అయితే ఏడాది పడుతుంది. స్లిమ్ లుక్ కోసం కడుపు మాడ్చుకున్నాను. గూనివాడి పాత్రను మేకప్‌తో సరిపెట్టేద్దాం అని శంకర్ అన్నప్పటికీ, నేను వినకుండా 56 కిలోల బరువుకు చేరుకున్నాను. మరో ఆరు కిలోలు తగ్గితే అవయవాలు ఫెయిల్ అవుతాయని డాక్టర్ హెచ్చరించారు అని విక్రమ్ తెలిపారు.
తన కష్టానకి తగిన ప్రతి ఫలం దక్కుతుందని, ఇప్పటి వరకు ఏ సినిమాకీ అందుకోనన్ని ప్రశంసలు అందుకున్నాను. అందుకే నేను పడిన కష్టాన్ని మరిచిపోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మూడేళ్లు ఈ సినిమా కోసమే కేటాయించాను. ఈ సమయంలో ఆరు సినిమాలు చేసే వాన్ని. కానీ ‘ఐ' లాంటి గొప్ప సినిమా కోసం ఆరు చెత్త సినిమాలు వదులుకున్నాని సరిపెట్టుకుంటున్నాను. ‘ఐ' ఫలితాలపై నా మనసు సంతోషంగా ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











