Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నకిలీ రోబో రజినీ తో అమీజాక్సన్ ఫోజు: రియల్ రజినీ కోసం ఎదురు చూపు
రోబో సినిమా కోసం శంకర్ రజినీ లా కనిపించే ఎన్నో రోబోలను తయారు చేయించిన సంగతి తెలిసిందే వాటిలో ఒక నకిలీ రోబో రజినీ తో ఫోజ్ ఇచ్చింది అమీ జాక్సన్
శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వెల్‌గా '2.0' సినిమా తెరకెక్కుతోంది. అత్యంత భారీబడ్జెట్తో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇందులో రజినీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా అమీజాక్సన్పై వచ్చే సన్నివేశాలను షూట్ చేసేందుకు సిద్ధమైంది శంకర్ యూనిట్. దీంతో సెట్స్‌పై అడుపెట్టబోతున్న అమీజాక్సన్ డైరెక్టర్ శంకర్ ఆఫీస్ లో 'రోబో రజినీ' తో ఫోటో దిగి అభిమానులతో షేర్ చేసుకుంది.
Recommended Video
రోబో 2.0 దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ కూడా చివరి దశలో ఉన్నాయి. అలాగే సినిమాలో సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత హీరోయిన్ అమీ జాక్సన్ చిత్ర యూనిట్ తో కలవనుంది. సినిమాలోని మొదటి పాట కు రెడి అవ్వబోతున్నట్లు తెలిపింది. రీసెంట్ ఆమె శంకర్ ఆఫీస్ లో ఉన్న రజినీకాంత్ కృత్రిమ రోబో తో ఒక ఫోటోకి స్టీల్ ఇచ్చింది. రోబో సినిమా కోసం శంకర్ ఎన్నో రోబోలను తయారు చేయించిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ వాటిలో ఒకదాన్ని తన ఆఫీస్ లో ఇలా ఉంచుకున్నాడట. ఇక రజినీకాంత్ తో రియల్ స్టెప్స్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటోంది అమీ.
దాదాపు 10 రోజుల వరకు ఆ సాంగ్ ని చిత్రీకరిస్తారట. అంతే కాకుండా ఆ సాంగ్ లో ఒక స్పెషల్ ఏంటంటే.. మైకేల్ జాక్సన్ కి ఆ పాటకి కొంచెం కనెక్షన్ ఉందట. శంకర్ ఊహలకు తగ్గట్టుగా ఒక అద్భుతమైన సెట్ లో సాంగ్ ఉంటుందని టాక్. ఇక ఏఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.