సినిమా ఇండస్ట్రీకి రావాలంటే సిగ్గు వదిలేయాలి: కొత్తవాళ్ళకి ఇదా సలహా???

Recommended Video

"It Is Very Important For An Actor To Be Shameless" Vidya Balan Says

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించే హీరో..హీరోయిన్లు పాత్రలను పండించేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ఆయా పాత్రలకనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటుంటారు. నటన, డాన్స్, మాటకారి తనం ఇవన్నీ ఉండాల్సిందే. అయితే బాలీవుడ్ స్పెషల్ అట్రాక్షన్ అనదగ్గ హీరోయిన్ విద్యాబాలన్ మాత్రం అసలు ఇవన్నీ తర్వాత ముందు ఇక్కడికి రావాలంటే సిగ్గుండకూదదు అని చెప్పేసింది.

సిగ్గులేకపోవటం అంటే

సిగ్గులేకపోవటం అంటే

సిగ్గులేకపోవటం అంటే మరీ బట్టలు వదిలెయ్యటం టైపుకాదు గానీ... మరీ ముడుచుకు పోయే తత్వం మాత్రం సరి పడదు అదే పెద్ద మైనస్ అవుతుందీ అని చెప్పింది. సిగ్గులేకుండా ఉండటం (షేమ్ లెస్ గా ఉండటం) ఒక యాక్టర్ కు చాలా ఇంపార్టెంట్. మొహమాటం... భయపడటం ఇక్కడ పనికిరావు.

 బిందాస్ గా ఉండటం అలవాటవ్వాలి

బిందాస్ గా ఉండటం అలవాటవ్వాలి

ఇక్కడ బిందాస్ గా ఉండటం అలవాటవ్వాలి" అంటోంది విద్యాబాలన్. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ పాత్రలతోనే వచ్చిన విధ్యా మొదటినుంచీ మంచి యాక్టింగ్‌తో పాటు గ్లామర్ కి కూడా ఏలోటూ లేకుండా అందరినీ మెప్పించుకుంటూ నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన నటి ఒక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపించినా.

 ఎక్కడయినా ఆత్మవిశ్వాసమే

ఎక్కడయినా ఆత్మవిశ్వాసమే

సిగ్గు.. బిడియం.. మొహమాటం వంటివి ఇండస్ట్రీకి ఎంత మాత్రం పనికిరావని కాస్తంత గట్టిగా చెప్పేసింది. సినిమా రంగమే కాదు.. ఎక్కడయినా ఆత్మవిశ్వాసమే కోరిన విజయాలను అందిస్తుంది. అందుకే విజయం కోసం ఎవరి దారి వాళ్లు వెతుక్కోవాల్సిందే అన్నది విద్యా బాలన్ మాట.

 తుమ్హారీ సులు

తుమ్హారీ సులు

బేగమ్ జాన్ నిరాశ పరిచిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కి ప్రాముఖ్యత ఉన్న పాత్రలోనే విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ తుమ్హారీ సులు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విద్యది మధ్యతరగతి ఇల్లాలి పాత్ర. అనుకోకుండా రేడియో జాకీగా మారి గుర్తింపు తెచ్చుకుంటుంది.

 రేడియోజాకీగా

రేడియోజాకీగా

ఆ గుర్తింపు ఆమె కుటుంబ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంతో ఈ సినమాను డైరెక్టర్ సురేష్ త్రివేణి తెరకెక్కించారు. గ‌తంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో రేడియోజాకీగా విద్యాబాల‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

సులోచ‌న అలియాస్ సులు

సులోచ‌న అలియాస్ సులు

ఈసారి కూడా సులోచ‌న అలియాస్ సులు పాత్ర‌లో విద్యాబాల‌న్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రుస్తుంద‌ని సినీవ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. సురేశ్ త్రివేణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 1న విడుద‌ల‌ కానుంది. ఇందులో నేహా దూపియా కూడా కీల‌క పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X