Leo లియో సినిమాకు షాక్.. స్క్రీన్ చించేసిన విజయ్ ఫ్యాన్స్!

దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లియో. ఇక ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ పై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన ప్రతీ చోట, ప్రతీ భాషలో లియో చిత్రం రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక ఈ సినిమాకు యూఎస్ఏలో షాక్ తగిలింది. యూఎస్ఏలో విజయ్ లియో సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తుంటే కొంత మంది ఆ స్క్రీన్ చింపేశారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దళపతి విజయ్ అంటే కేవలం తమిళనాడులోనే కాదు.. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఆయన సినిమా వస్తుందంటే.. అన్ని దేశాల్లో ప్రదర్శిస్తారు. ఆయన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన చిత్రం లియో. అందాల భామ త్రిష హీరోయిన్ గా నటించింది. టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

An angry person tore the screen of Vijays Leo in the middle of screening in USA Video Goes Viral

ఇక విజయ్ లియో చిత్రాన్ని 300 కోట్ల రూపాయలతో ప్రముఖ నిర్మాత లలిత్ కుమార్ నిర్మించారు. ఇక అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. తొలి రోజే 140 కోట్లు రాబట్టి రికార్టు సృష్టించింది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా దాదాపు 450 కోట్ల రూపాయలను రాట్టిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ లోనూ దుమ్ములేపే కలెక్షన్స్ రాబడుతోంది.

ఇదిలా ఉండగా... యూఎస్ఏలో లియో సినిమాకు ఓ షాక్ తగిలింది. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు... స్క్రీన్ ను చించివేశారు. విజయ్ సినిమాపై కోపంతో ఇలా చేశారా... లేదా ఇంకా ఏదైనా కారణంతో చించివేశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ తమకు నష్టాలు రావడంతో చించివేశారని నెట్టింట వైరల్ గా మారింది. అయితే సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.. అలా ఎందుకు చేస్తారని నెటిజన్స్ అంటున్నారు.

An angry person tore the screen of Vijays Leo in the middle of screening in USA Video Goes Viral

లియో సినిమా ప్రదర్శిస్తుండగా... స్క్రీన్ చించివేసిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఎవరు చించారనే విషయాలు బయటకు రావాల్సి ఉంది. ప్రముఖ సినిమా అనాలిస్ట్ మనోబాల దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అయితే ఆయన విజయ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్లు విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నాయో.. మొత్తానికి విజయ్ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

లియో సినిమా 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. మంగళవారం హాలీడే కావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 450 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X