ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన చిత్రాల్లో 'ద ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్' (ఇ.టి.) చూడనివారి మెచ్చుకోనివారు అరుదు. అయితే 1982లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తారని చాలా కాలంగా ఆయన అబిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతకాలమైనా కేవలం ఆ సీక్వెల్ వార్తలు రావటమే కానీ కార్యరూపం దాల్చలేదు. హెన్రీ థామస్, డ్రూ బ్యారీమూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆధారంగా హిందిలో కోయి మిల్ గయా చిత్రం రిలీజై సూపర్ హిట్టయింది.ఇలా ప్రపంచాన్ని ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్న ఈ సినిమా సీక్వెల్ గురించి స్పీల్ బర్గ్ స్వయంగా ఇ.టి. అనేది పూర్తయిపోయిన కథ. ఇక దానికి కొనసాగింపు అనేది ఉండదు. కాబట్టి ఆ సినిమా రెండో భాగం గురించి ఎవరూ ఎదురు చూడొద్దు అని చెప్పారు.