పవన్ ఫ్యాన్స్‌కి దిల్‌రాజు రాంగ్ నెం, అమాయకుడు బలి!
హైదరాబాద్: శివమణి సినిమాలో......శివమణి అభిమానుల నుండి వచ్చే రాంగ్ కాల్స్‌తో ఓ అమాయకుడు బలైన సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్ లో చోటు చేసుకుంది. నిర్మాత దిల్ రాజు వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫలితంగా ఓ అమాయకుడు తనకు సంబంధం లేని కాల్స్‌తో ఇబ్బంది పడ్డాడు.
అసలు విషయంలోకి వెళితే... ఇటీవల వైజాగ్‌లో ‘పిల్లా నువ్వే లేని జీవితం' సక్సెస్ మీట్ జరిగింది. కొందరు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా దిల్ రాజుపై ఒత్తిడి తెచ్చారు. వారి పోరు పడలేక....ఓ తప్పుడు నెంబర్ ఇచ్చారు దిల్ రాజు. ఆ నెంబర్‌కు పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి వరుస పెట్టి కాల్స్ వెళ్లడంతో సదరు వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. విషయాన్ని దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వెంటనే దిల్ రాజు ఆఫీసు నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

‘దిల్ రాజు గారు ‘పిల్లా నువ్వు లేని జీవితం' వైజాగ్ సక్సెస్ మీట్ సందర్భంగా ఇచ్చిన నెంబర్ పవన్ కళ్యాణ్‌కు చెందినది కాదు. అభిమానుల ఒత్తిడి భరించలేక దిల్ రాజు గారు తను రెగ్యులర్‌గా వాడని పాత నెంబర్ ఒకటి ఇచ్చారు. అయితే అనుకోకుండా ఓ నెంబర్ తప్పుగా ఇచ్చారు. దీంతో సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తికి రాంగ్ కాల్స్ వెళ్లడం ప్రారంభం అయింది. అభిమానులు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తూ ఆయన్ను డిస్ట్రబ్ చేస్తున్నట్లు తెలిసింది. దయ చేసి అభిమానులు జరిగిన పొరపాటను గ్రహించి ఆ నెంబర్ కు కాల్ చేయడం ఆపండి. జరిగిన తప్పిదానికి అభిమానులకు, ఆ వ్యక్తి అపాలజీ చెబుతున్నాము' అంటూ దిల్ రాజు కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది.


Click it and Unblock the Notifications











