For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అన్నా…. రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా: బాలయ్యకు బహిరంగ లేఖ

  |

  టాలీవుడ్ హీరోల్లో బాలయ్య బాబు తరహానే వేరు సినిమాల్లో ఎంత రౌద్రాన్ని ప్రదర్షిస్తారో బయట మాత్రం చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు అంటూ చెప్తూంటారు ఆయన తో పని చేసిన వాళ్ళంతా. కానీ బయట కనిపించే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుంది. సీసీఎల్ లో జనం మధ్యే సిగరెట్ తాగినా.., "కొట్టానంటే అయిపోయావే.. అంటూ ఫొటో దిగటానికి వచ్చిన అభిమానిని బెదిరించినా బాలయ్య స్టైలేవేరు.

  కారణం ఏదైనా

  కారణం ఏదైనా

  మామూలుగా బాగా సహనం తోనే ఉండే బాలకృష్ణ కొన్ని సార్లు మాత్రం ఆ సహనాన్ని కోల్పోతారు. వర్క్ టెన్షన్ కావచ్చు, రాజకీయ జీవితం లో ఉండే ఒత్తిళ్ళు కావచ్చు.. కారణం ఏదైనా అప్పటి వరకూ నవ్వుతూనే ఉన్నా వెంటనే సీరియస్ అయిపోతడు. కాస్త చికాకు వస్తే "ఏంటీ గోల మమ్మల్ని **గెయ్ మంటారా?" అనేస్తాడు. వెన్నలాంటి బాలయ్య మనసు ఆసమయం లో మాత్రం కొంచం కఠినంగా అనిపిస్తుంది.

  Balakrishna Need Three Heroines - Filmibeat Telugu
  కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు

  కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు

  ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు.

  అసిస్టెంట్ షూ విప్పటం

  అసిస్టెంట్ షూ విప్పటం

  బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే బాలయ్య కావాలని కోపంతో చేసినట్టు కాక సరదాగానే చేసినట్టు కనిపిస్తుందీ దీనికింత రాద్దాంతమా అంటూన్నారు అభిమానులు.. అయితే బాలయ్య ప్రవర్తన మీద ఒక బహిరంగ లేఖ సోషల్ మీడియా లో షేర్ అవుతోంది... "అన్నా.... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా" అంటూ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

  రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..!

  రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..!

  అన్నా.... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..! ఆడది కనబడితే కడుపు చేయమంటావ్, మగాడు కనబడితే చెప్పులు తాకమంటావ్, ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావ్, ఫోన్ చేస్తే బూతులు మాట్లాడ్తావ్ ,దొరలు, రాజులు, రాచరిక వాదులకాలం పోయి శానా కాలమైంది.

  మీరు దొరల్లా ఫీల్ అవకండి

  మీరు దొరల్లా ఫీల్ అవకండి

  ఇది ప్రజాస్వామ్యం ఇంకా మీరు దొరల్లా ఫీల్ అవకండి. పొగరు దరి చేరనంతవరకే ఏ కళకైనా విలువ. ఒక కళాకారుడైన మీకు ఇది తగదు.సారూ మీపై ఆధార పడి ఎవరూ బతకట్లేదు,మీరే ప్రజలపైన, అభిమానులపైన ఆధార పడి బతుకుతున్నారు. మీ బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు.

  ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది

  ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది

  పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ చప్పుడుపైనే ఆధారపడి ఉంది. రేపు నీ సినిమాని మేం బహిష్కరించాం అనుకో. VIP లో ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది. తెలుగు తెలుగు తెలుగు అని మాటి మాటికి ఉచ్చరించే మీరు మనుష్యుడే నా సంగీతం..మానవుడే నా సందేశం అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే... ఈరోజిలా సాటి మనిషిని నీ చెప్పులు తాకమని చేయి చేస్కోవు.

  నీ చెప్పులు తుడిచే బానిస కాదు

  నీ చెప్పులు తుడిచే బానిస కాదు

  అతడు పనివాడే కావొచ్చు..కానీ ఒక మనిషేనని గుర్తుంచుకోండి నువ్వు ఎంత గొప్ప వాడివైనా కావొచ్చు..సాటి మనిషి మాత్రం..నీ చెప్పులు తుడిచే బానిస కాదు. 21 వ దశాబ్దంలో..70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా కులం కంపు,జాత్యహంకార కంపు,ధనాహంకార కంపుకొడుతోంది.

  సోషల్ మీడియాలో చెక్కర్లు

  సోషల్ మీడియాలో చెక్కర్లు

  ధన బలం, అధికార బలంతో రమించిన మీ ప్రవర్తన బురదలో బొర్లే పంది వలే వెర్రి తలలు వేస్తుంది. అన్నా.....రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..... ఈ బహిరంగలేఖ బాలకృష్ణగారికి చేరాలని సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

  English summary
  An Open letter For Tollywood Star hero Nandamuri Balakrishna is trending now in Social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X