twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పోరాటం కొనసాగుతుంది: హీరో బహిరంగ లేఖ

    ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు వచ్చిన వార్తలను సినీ నటుడు విశాల్‌ ఖండిచారు. ఈ ఉపఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉండదని విశాల్ ప్రకటించాడు.

    |

    ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు వచ్చిన వార్తలను సినీ నటుడు విశాల్‌ ఖండిచారు. ఈ ఉపఎన్నికలో తన మద్దతు ఎవరికి ఉండదని విశాల్ ప్రకటించాడు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక బహిరంగ లేఖ రాశాడు.

     ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ

    ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ

    ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనున్న ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని తాను తీసుకున్న నిర్ణయం వెనుక ఏ ఒక్కరి ప్రోద్భలం లేదన్నా రు. ఆర్‌కే నగర్‌ వాసులకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను స్వతహాగా ఈ నిర్ణయం తీసుకుని నామినేషన్‌ వేసినట్టు తెలిపారు.

     పవర్‌ పాలిటిక్స్‌

    పవర్‌ పాలిటిక్స్‌

    అయితే, పవర్‌ పాలిటిక్స్‌ తన నామినేషన్‌ను తిరస్కరణకు గురిచేశాయన్నారు. అదేసమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే, ఇప్పటివరకు తాను చేసిన పోరాటంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

     సేవ చేయాల‌నే ఉద్దేశంతో

    సేవ చేయాల‌నే ఉద్దేశంతో

    ప్ర‌జ‌ల‌కు మ‌న‌స్ఫూర్తిగా సేవ చేయాల‌నే ఉద్దేశంతోనే నేను నామినేష‌న్ వేశాను. నాపై ఎవ‌రి ఒత్తిడి లేదు. నేను వేసిన నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ‌డం నిజంగా అనైతికం. దీన్ని బ‌ట్టి ప్ర‌జాస్వామ్యం ప‌రిస్థితి ఏంటో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు అర్థం చేసుకోవచ్చు' అన్నారు.

     కొత్త ఉత్తేజంతో

    కొత్త ఉత్తేజంతో

    ఇప్పుడు త‌న నామినేష‌న్ విష‌యం కంటే దృష్టి సారించాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని, ముఖ్యంగా త‌ప్పిపోయిన క‌న్యాకుమారి జాలరుల‌ను వెతికి ప‌ట్టుకోవ‌డంలో అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని విశాల్ కోరారు. అలాగే కొత్త ఉత్తేజంతో మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని పేర్కొన్నారు.

    English summary
    Actor Vishal writes to the people of Tamil Nadu following the rejection of his nomination papers to R.K. Nagar by-election
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X