twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ పాట

    |

    విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' చిత్రం లోని టైటిల్ సాంగ్ ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగుంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను , తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ , ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న " అని మాట్లాడారు.

    Anaganaga O kadha launched by Sekhar kummala

    తమ చిత్రంలోని పాటను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

    Anaganaga O kadha launched by Sekhar kummala

    ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ, నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

    English summary
    Anaganaga O Premakatha” movie title itself indicates it”s a pure love story. The movie has a very unique element in it which the current generation will identify with. This is a film produced by K L N Raju and presented by K. sathish kumar under Thousand Lights Media pvt ltd and directed by Pratap Tatamsetti. “Anaganaga O kadha” was launched by the sensible Director Sekhar kummala at production office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X