డిసెంబర్ 14న ‘అనగనగా ఓ ప్రేమకథ’

విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ'. ప్రతాప్‌ తాతంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్‌.ఎన్ రాజు మాట్లాడుతూ - అశ్విన్‌, రిద్ది, రాధా బంగారు స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హకారంతో మంచి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్ట‌డానికి తండ్రి ఏం చేశాడ‌నేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్‌. డిసెంబ‌ర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

Anaganaga O Premakatha on Dec 14th

ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ తాతం శెట్టి మాట్లాడుతూ - ఇదొక క్యూట్ ల‌వ్ స్టోరీ. అహ్లాద‌క‌రంగా ఉంటూ ప్రేక్షకులు మంచి వినోదం పంచుతుంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆదరిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.

సున‌య‌న మాట్లాడుతూ - మా మామ‌గారు కె.ఎల్.ఎన్ రాజుగారు చిన్న సినిమాల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో.. ఈ సినిమా చేశాం. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. ఈ నెల 14న మా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది అన్నారు.

విరాట్‌ జె.అశ్విన్ మాట్లాడుతూ - రాజుగారి బ్యాన‌ర్‌లో హీరోగా ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది. మావ‌య్య మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌వ‌తున్న మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.

రిద్ది కుమార్ మాట్లాడుతూ - తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X