‘మగధీర’ రికార్డుల్ని తిరగరాయాలనే ఆకాంక్షతో రామ్ చరణ్ తేజ్....
టాలీవుడ్ లో గతంలో పోల్చితే, ప్రస్తుత హీరోల మధ్య కాస్త సఖ్యత ఎక్కువగానే కన్సిస్తోంది. ప్రధానంగా యువహీరోలు అమరికల్లేకుండా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఆయా సినిమా ఫంక్షన్స్ లో. ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే, దాదాపు అందుబాటులో వున్న హీరోలంతా హాజరవుతున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అనీ, నందమూరి ఫ్యామిలీ అనీ వున్న బౌండరీస్ ఇప్పుడు చెరిగిపోవడమే కాదు, సినీ రంగంలో ఇతరత్రా బేషజాలతో దూరంగా వుంటున్న కుటుంబాలు ఇప్పుడు ఎంచక్కా కలిసిపోతున్నాయి.
అలా కలిసిపోవడానికి యువ హీరోలు కారణమవుతుండడం విశేషమే మరి. తాజాగా, సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన 'అనగనగా ఒక ధీరుడు" సినిమా ఆడియో విడుదల వేడుకలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్..ఇలా యంగ్ హీరోలంతా ఒక్క చోట చేరారు. ఒక్కచోట చేరడమే కాదు, పిచ్చాపాటీ కబుర్లతో కాలక్షేపం చేశారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ హీరో సిద్దార్థకి విషెస్ అందజేశారు. టాలీవుడ్ లో 'అనగనగా ఒక ధీరుడు" సినిమా రికార్డుల్ని తిరగరాసే విజయం సాధించాలనీ, 'మగధీర" రికార్డుల్ని తిరగరాయాలనీ చరణ్ అకాంక్షించాడు. తన సినిమా రికార్డుల్ని తానో, తన కుటుంబంలోని వారు మాత్రమే బద్దలు గొట్టగలరనే నిన్నమొన్నటి వన్ సైడ్ స్టేట్ మెంట్లకు కాలం చెల్లి..ఇప్పడు సినీ పరిశ్రమలో ఒకరి సినిమా హిట్టవ్వాలని ఇంకొకరు కోరుకుటుండడం ఆహ్యానించదగ్గ పరిణామమే..


Click it and Unblock the Notifications











