ఎందుకు నోరు మెదపడం లేదు? తెలుగు సినీ హీరోల మీద టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏపీలో టికెట్ల రేట్లు వివాదం కొనసాగుతూనే ఉంది. ముందు నుంచి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా ఇండస్ట్రీ తరపున ఎవరూ గట్టిగా అయితే ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్, నాని లాంటి వాళ్లు మాట్లాడితే వారి మీద వైసీపీ నేతల నుంచి గట్టి కౌంటర్లు పడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ ప్ర‌శ్న

ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ ప్ర‌శ్న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌లు, థియేట‌ర్ల మూసివేత‌, త‌నిఖీల విష‌యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ పరిశ్రమకు మధ్య వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై సినీ పెద్ద‌లు పెద్దగా బయటకు వచ్చి మాటలాడ లేదు. ఈ క్రమంలో వారు ఎందుకు స్పందించ‌ట్లేద‌ని టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ ప్ర‌శ్నించారు.

త‌నిఖీల పేరుతో

త‌నిఖీల పేరుతో

సినీ పరిశ్ర‌మ‌పై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది ఆధార‌ప‌డ్డారని పేర్కొన్న ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ ఇప్పుడు ఏపీలో త‌నిఖీల పేరుతో థియేట‌ర్లు మూతప‌డుతుండ‌డంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వేధింపుల‌కు గురి చేస్తుంటే సినీ పెద్ద‌లు నోరు మెద‌ప‌ట్లేదని ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ విమ‌ర్శించారు.

 రీల్ హీరోలుగా

రీల్ హీరోలుగా

ఏపీలో హీరోలు రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారని, వారు రియ‌ల్ హీరోలుగా మార‌రా? అని అన‌గాని స‌త్యప్ర‌సాద్ ప్రశ్నించారు. కావేరి న‌దీ జ‌లాల స‌మ‌స్య‌పై అక్క‌డి సినీ ప‌రిశ్ర‌మ అంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారని, జ‌ల్లిక‌ట్టు అంశంపై కూడా త‌మిళ హీరోలంతా స్పందించారని ఆయ‌న గుర్తు చేశారు. ఇక్క‌డి హీరోలు మాత్రం స‌మ‌స్య‌ల‌పై ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ నిల‌దీశారు.

హీరోల‌కు ప‌ట్ట‌వా?

హీరోల‌కు ప‌ట్ట‌వా?

హీరోల సినిమాలు ప్ర‌జ‌లు చూడాలి కానీ, ప్ర‌జ‌ల క‌ష్టాలు మాత్రం ఈ సినిమా హీరోల‌కు ప‌ట్ట‌వా? అని ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ర‌ద్దు చేసి భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను కూడా ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇబ్బంది పెట్టారని ఆయ‌న అన్నారు. ఇప్పుడు థియేట‌ర్ల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ విమ‌ర్శించారు.

టికెట్ రేట్ల పెంపు మీద కమిటీ

టికెట్ రేట్ల పెంపు మీద కమిటీ

అయితే ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు, థియేట‌ర్ల మూసివేత అంశంపై ఇప్ప‌టికే సినీ న‌టుడు ఆర్.నారాయ‌ణ మూర్తి ప‌లువురు థియేట‌ర్ల య‌జ‌మానుల‌తో క‌లిసి ఏపీ మంత్రి పేర్ని నానితో చ‌ర్చించగా సీజ్ చేసిన థియేట‌ర్ల‌లో సౌక‌ర్యాలు క‌ల్పించి తెరుచుకోవ‌చ్చ‌ని ఏపీ స‌ర్కారు నిన్న ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయం మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

సమంత సపోర్ట్

సమంత సపోర్ట్

రేపల్లె నుంచి టీడీపీ అభ్యర్ధిగా అనగాని సత్య ప్రసాద్‌ పోటీచేశారు. ఆయన్ను గెలిపించాలని కోరుతూ సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఎన్నికల సమయంలో వీడియో కూడా పోస్ట్ చేశారు సమంత. సత్య ప్రసాద్‌కు మద్దతుగా నిలవడానికి కారణం ఆయన సోదరి అనగాని మంజుల సమంత స్నేహితురాలు. మొత్తం మీద అనగాని సత్యప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి దీని మీద హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X