సిద్ధార్థ్ సరసన వర్మ హీరోయిన్
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం సత్య 2 లో హీరోయిన్ గా చేస్తున్న అనైక ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమెకు సౌత్ నుంచి ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. తాజాగా ఆమె సిద్దార్ద సరసన ఎంపికైంది.
'అనగనగా ఓ ధీరుడు'తో జానపద చిత్రం చేశారు సిద్ధార్థ్. ఇప్పుడు చారిత్రక కథాంశంతో రూపొందే సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమాకి శంకర్ శిష్యుడు వసంత బాలన్ దర్శకత్వం వహిస్తారు. ఇందులో హీరోయిన్ గా అనైక ఎంపికైంది.
ఆనైక ఇప్పుడు సిద్ధుతో జోడీ కట్టే అవకాశం దక్కించుకోవటంతో చాలా ఉత్సాహంగా ఉంది. తనకు సౌత్ లో ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది. . ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారు.


Click it and Unblock the Notifications












