జూ ఎన్టీఆర్ పెళ్లికి అతడే...ఇప్పుడు చెర్రీ పెళ్లికి కూడా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన వివాహం జూన్ 14న జరుగనున్న నేపథ్యంలో ఈ వేడుక కోసం సినిమాలో మాదిరి భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి అప్పగించారు. ఇందుకోసం దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కోసం అద్భుతమైన సెట్ వేసిన ఆనంద్ సాయి అందరి ప్రశంసలు అందుకున్నారు. బద్రీనాథ్ చిత్రంలో బద్రీనాథ్ టెంపుల్ సెట్, దమ్ము చిత్రంలో జమిందార్ ప్యాలెస్ సెట్ అద్భుతంగా వేసిన ఆనంద్ సాయి మెగా కుటుంబానికి చెందిన హీరో కోసం ఏ రేంజిలో సెట్ వేస్తారో? అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఈ ఆర్ట్ డైరెక్టర్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రానికి పని చేస్తున్నారు. మరో వైపు వివి వినాయక్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రానికి కూడా ఆనంద్ సాయే ఆర్ట్ డైరెక్టర్. ఇటీవల ఆయన ఈ విషయమై స్పందిస్తూ...చరణ్ వెడ్డింగ్‌తో పాటు, సంగీత్, రిసెప్షన్లకు ప్రత్యేకంగా సెట్ డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' చిత్రం ద్వారా తన కెరీర్ మొదలు పెట్టిన ఆనంద్ సాయికి మెగా కుటుంబం అంటే మహా అభిమానం. ఈ నేపథ్యంలో చరణ్ వెడ్డింగ్ కోసం ఇప్పటి వరకు తాను వేసిన సెట్టింగులన్నింటికంటే బెస్ట్ సెట్టింగ్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అది ఏ రేంజిలో ఉంటుందో తెలియాలంటే జూన్ 14 వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











