Don't Miss!
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చేయడానికి అసలు కారణమిదే: ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మొత్తానికి ఓటీటీ ప్రపంచంలో ఒక మంచి హిట్ మూవీగా నిలిచింది. థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా కరోనా కష్టకాలంలో అమెజాన్ లో విడుదల అయ్యింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రెస్పాన్స్ కి చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో వారి ఆనందాన్ని సినిమా విశేషాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఫిల్మీబీట్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ఆనంద్ దేవరకొండ కొన్ని విషయాల గురించి మాట్లాడారు.
Recommended Video
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఈ దీపావళికి అన్నయ్య స్నేహితులు కొంతమంది ఇంటికి వచ్చారు అంటూ ఎక్కువగా సౌండ్ లేకుండా చాలా కూల్ గా సెలబ్రేట్ చేసుకున్నామని అన్నాడు. ఇక ఇక మిడిల్ క్లాస్ సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను రాఘవ అనే పాత్రలో నటించాను. గుంటూరు బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమా నిజమైన ఫ్యామిలి ఎమోషన్స్ తో తెరకెక్కింది. ఇక ఒక చిన్న గ్రామంలో టిఫిన్ సెంటర్ ని నడిపే ఫ్యామిలీలో పుట్టిన రాఘవ ఎలాగైనా గుంటూరు సెంటర్ పెద్ద టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకుంటాడు.
ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురావుతాయనేది సినిమా మెయిన్ ప్లాట్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ ట్రాక్, ఫ్రెండ్షిప్, మూఢ నమ్మకాలు.. ఇలా మిడిల్ క్లాస్ లో ఉండే ప్రతి దాన్ని చూపించడం జరిగింది. అందుకే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్ సెట్టయ్యింది. ఈ సినిమాకు నేను కనెక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. మిడిల్ క్లాస్ లో ఉండే చాలా అనుభవాల గురించి నాకు తెలుసు. మిడిల్ క్లాస్ జీవితాల్లో ఒక మెట్టు నుంచి వెంటనే మరొక మెట్టు ఎక్కలని అనుకుంటారు. ఎప్పుడు ఆ ఆశలతో కలలతో జీవితం సాగుతూ ఉంటుంది. నేను కూడా అలాంటి పరిస్థితుల నుంచే వచ్చాను. ఆ పాయింట్ ఈ సినిమాలో ఉండడం వలన కాస్త కనెక్ట్ అయ్యాను. పెళ్లి చూపులకు, మిడిల్ క్లాస్ మెలోడీస్ కి ఉన్న కామన్ పాయింట్ ఫుడ్. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరిని సినిమా తప్పకుండా ఎట్రాక్ట్ చేస్తుందని ఆనంద్ వివరణ ఇచ్చాడు.