Baby Movie Repeat: విశాఖలో 'బేబీ' సినిమా రిపీట్... కానీ ఇక్కడ ఊహించని విషాదాలు

చిన్న సినిమాగా రిలీజ్ అయి.. ఓ పెను సంచలనం సృష్టించిన సినిమా బేబి. అయితే అందులోని స్టోరీ వల్లే సినిమా హిట్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు అదే స్టోరీ నిజ జీవితంలో రిపీట్ అయితే...? అవును.. విశాఖలో బేబీ సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. సినిమాలో ఓ ఇద్దరి కుర్రాళ్లను ప్రేమించిన యువతి.. ఇద్దరూ వచ్చి నిలదీస్తే... చివరకు ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే.. కానీ మరో ఊహించని విషాదం కూడా చోటుచేసుకుంది. అదేందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Anand Devarakonda

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలం సృష్టించిన సినిమా బేబి. చిన్న సినిమాగా రిలీజ్ అయి.. సూపర్ హిట్టుగా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఇక ఈ మూవీలో హీరోయిన్ చిన్నప్పుడే హీరోతో ప్రేమలో పడుతుంది. హీరోయిన్ పైచదువుల కోసం కాలేజీలో చేరితే.. హీరో మాత్రం ఆటో నడుపుతూ.. ఆమె కోసమే బతుకుతూ ఉంటాడు.

Anand Devarakonda

కట్ చేస్తే.. ఆ హీరోయిన్ కాలేజ్ లో మరో హీరోతో చనువుగా ఉంటుంది. తనకు ఇంతకుముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే ఒక్క మాట చెబితే.. అక్కడికి ఆ కథ సుఖాంతం అయ్యేది. కానీ ఆమె ఆ విషయం దాచి పెడుతుంది. మరో హీరోకు కూడా దగ్గరవుతుంది. అలా ఇద్దరి జీవితాలతో ఆమె ఆడిన ఆటే ఆ సినిమా కథ. ఒకనొక సందర్భంలో ఇక ఇద్దరు హీరోలు వచ్చి హీరోయిన్ ను నిలదీస్తారు. అప్పుడు దిక్కు తోచని స్థితిలో ఆమె సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే ఘటన నిజజీవితంలో చోటుచేసుకుంది.

Anand Devarakonda

విశాఖ జిల్లా గోపాలపట్నంలో బేబీ తరహా ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ విషాదాంతమైంది. ఇద్దరు అబ్బాయిలు.. ఒకే అమ్మాయిని ఇష్టపడడం.. ఆమె ఇద్దరితోనూ చనువుగా ఉండడం.. ఆ ఫొటోలు, వీడియోలు అన్నీ వైరల్‌ కావడంతో చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన యువతి మైనర్‌ కావడం, ఆమె సూసైడ్‌ నోట్‌ కూడా రాయడంతో దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్‌ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయికి స్థానికంగానే ఉండే సాయికుమార్‌, సూర్యప్రకాష్‌ అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే సాయికుమార్‌ బాలికకు రహస్యంగా తాళి కూడా కట్టాడు. ఇప్పుడు ఆ వీడియో ఒకటి బయటకు వచ్చి.. వైరల్ గా మారింది. ఇక సూర్యప్రకాశ్‌ తోనూ బాలిక సన్నిహితంగా ఉండేది. దీనితో ప్రేమ విషయంలో అటో ఇటో తేల్చుకోవాలంటూ ఇద్దరూ ఆమెను నిలదీశారు. ఇక్కడ ఆ బాలిక బేబీ సినిమాలో వలే.. సూసైడ్ కు ప్రయత్నం చేసి.. చనిపోతుంది. చనిపోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ రాసింది.

బాలిక సూసైడ్ నోట్ లో... సూర్య ఎవరినీ వదలకు... అందరూ కుక్క చావు చావలి అంటూ రాసుకొచ్చింది. నువ్వు నా ఫేవరెట్ పర్సన్.. నాకు ఏమైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను లేక పోయినా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నా రక్తం.. నువ్వు నా ప్రాణం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ జన్మలో ఏ కుక్కగానో, పిల్లిగానో పుడతాను. తల్లిదండ్రులు ఇద్దరు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు... అంటూ రాసుకొచ్చింది.

Anand Devarakonda

అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే... బాలిక సూసైడ్ చేసుకోవడంతో.. సూర్య ప్రకాశ్ కూడా ఆత్మహత్యకు పాల్పడుతాడు. దీనితో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపతున్నారు పోలీసులు. మొత్తానికి చిన్న వయసులోనే క్లారిటీ లేని ప్రేమలతో ఇద్దరు చావులు, ఒకరు అరెస్టుకు కారణం అయింది. ఇలా బేబీ సినిమా తరహా ఘటన జరగడంతో.. హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X