Pushpaka Vimanam Twitter Review: చిన్న రౌడీ సినిమాకు ఊహించని టాక్.. మొత్తం మీద సినిమా టాక్ ఎలా ఉంది అంటే?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఎలాగైనా హీరోగా ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగి తాను స్వయంగా 'పుష్పక విమానం' సినిమాను సమర్పిస్తున్న నిర్మించి ఆనంద్ దేవరకొండను ప్రేక్షకుల ముందుంచారు. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన విడుదలైంది. ఆ సినిమా ఎలా ఉందొ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

చిన్న రౌడీ

చిన్న రౌడీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోగా ఇప్పుడు ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చిన్న చిత్రాలు చేస్తూ హీరోగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆనంద్ దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలు చేశారు. తాజాగా ఆనంద్ 'పుష్పక విమానం ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవ‌ర‌కొండ సరసన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.

మంచి బజ్

మంచి బజ్

శుక్రవారం నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడం.. స్వయంగా ప్రచారం కోసం విజయ్ రంగంలోకి దిగడంతో పుష్పక విమానం చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ట్విట్టర్ లో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

 భర్త కోణంలో

భర్త కోణంలో

పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయింది అంటూ గగ్గోలు పెట్టే భర్త కోణంలో ఒక ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో చిట్టి లంక సుందర్ పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలోనే సుందర్ కి మీనాక్షి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. పెళ్ళైన మరుసటి రోజే మీనాక్షి కనపడకుండా పోతుంది.

 బోర్ కొట్టించకుండా

బోర్ కొట్టించకుండా

లేచిపోయిందనే విషయం సమాజానికి ఈ విషయం తెలియకుండా దాచి పెట్టేందుకు సుందర్ కష్టపడుతుంటాడు. అలా కీలకమైన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని ట్విటర్ యూజర్స్ తమ రివ్యూ చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా ఏమీ ఉండదు కానీ భార్య మిస్సయ్యిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని, కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫస్ట్ హాఫ్ ఉందని అంటున్నారు.

Recommended Video

Pushpaka Vimanam Public Talk
మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన


సెకండ్ హాఫ్ లో కథ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి మారుతుంది. సునీల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతుందని ట్విట్టర్ యూజర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం యావరేజ్ అని కొందరు అంటుంటే బాగుందని మరి కొందరు అంటున్నారు. స్క్రీన్ ప్లే ఊహకందని విధంగా ఉంటుందని, అనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడని కొందరు అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X