బడా ప్రొడ్యూసర్ దృష్టిలో పడిన ఆనంద్ దేవరకొండ.. ఈ సారి హిట్టు దర్శకుడితో అంతకుమించి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కష్టపడి పైకొచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. చిన్నపాటి సపోర్టింగ్ రోల్స్ నుంచి వందకోట్ల మార్కెట్ వరకు ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చాడు. ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అదే తరహాలో మెల్లమెల్లగా తన రేంజ్ ను పెంచుకునే విధంగా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక బడా ప్రొడ్యూసర్ దృష్టిలో పడినట్లు తెలుస్తోంది.

మొదటి సినిమాతోనే కాస్త డిఫరెంట్ గా..

మొదటి సినిమాతోనే కాస్త డిఫరెంట్ గా..

ఆనంద్ దేవరకొండ మొదట దొరసాని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆనంద్ తో పాటు రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే కాస్త డిఫరెంట్ గా అడుగు వేసిన ఆనంద్ నటుడిగా ఓ వర్గం నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకున్నాడు.

థియేటర్స్ లోకి వచ్చి ఉంటే..

థియేటర్స్ లోకి వచ్చి ఉంటే..

ఇక రెండవ సినిమాతో ఆనంద్ దేవరకొండ థియేటర్స్ లోకి వచ్చి ఉంటే బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకునేవాడనే చెప్పాలి. కానీ కరోనా లాక్ డౌన్ వలన ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మంచి హిట్ మూవీగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఆ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఆనంద్ నటనలో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడనే చెప్పాలి.

బడా ప్రొడక్షన్ లో..

బడా ప్రొడక్షన్ లో..

ఇక ఈ సారి మూడవ సినిమాతో ఆడియెన్స్ ను మరింత డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని అడుగులు వేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సురేష్ బాబు స్క్రిప్ట్ అలాగే హీరో ఎంతగానో నచ్చితే గాని ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకురారు.

Recommended Video

Vijay Devarakonda Liger Movie Craze In Hyderabad | Filmibeat Telugu
దర్శకుడు ఎవరంటే..

దర్శకుడు ఎవరంటే..

ఎంతో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ ఆనంద్ ను సెలెక్ట్ చేసుకున్నారు అంటే తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక దర్శకుడు మరెవరో కాదు. కళ్యాణ్ రామ్ తో 118 అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన కెవి.గుహన్. ఈయన పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశారు. మరి ఆనంద్ తో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X