For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpaka Vimanam Flying Hit.. ఆనంద్ దేవరకొండ టీమ్ విజయోత్సవ సంబురాలు

  |

  యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్నది. వినోదంతోపాటు సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ క్రమంలో యూనిట్ థ్యాక్స్ మీటింగ్ నిర్వహించింది. "పుష్పక విమానం" సినిమా ఫ్లైయింగ్ హిట్ అవడం సంతోషంగా ఉందని ఆనంద్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన "పుష్పక విమానం" సినిమా అన్ని చోట్ల నుంచీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

  హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..."పుష్పక విమానం" మీద మా అంచనాలు నిజమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా హిట్ టాక్ వస్తోంది. అన్నయ్య విజయ్ యూఎస్ లో ఉన్నారు. థియేటర్ లలో "పుష్పక విమానం" కు వస్తున్న రెస్పాన్స్ వీడియోలు ఆయనకు పంపించాం. విజయ్ నిర్మాతగా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. నా పర్మార్మెన్స్ తో పాటు ఇద్దరు హీరోయిన్స్ బాగుందని చెబుతున్నారు. నాకు ఇండస్ట్రీ నుంచే కాకుండా యూఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కథ విన్నప్పుడు దర్శకుడు చెప్పాడు...కామెడీ ఫ్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా సినిమా చేయొచ్చని, ఇవాళ థియేటర్లలో అదే రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కథలో సందర్భానుసారం వచ్చే కామెడీ సీన్స్ కు బాగా నవ్వుతున్నారు. ఇలాంటి సిట్యువేషనల్ కామెడీ ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. వచ్చే రెండు వారాలు "పుష్పక విమానం" చిత్రాన్ని మీరు చూసి ఆనందించండి. అన్నారు.

   Anand Deverakonda celebrate Pushpaka Vimanam hit with Thanks meet

  హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ..."పుష్పక విమానం" సినిమా చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఆనంద్ ఫ్యాన్స్ అయ్యారు. సినిమాను అందరూ ఇష్టపడుతున్నారు. మీనాక్షి క్యారెక్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని టెన్షన్ పడ్డాను. కానీ థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ నా క్యారెక్టర్ ద్వారా రిలేట్ అవుతున్నారు. మీనాక్షి ద్వారా వచ్చే థ్రిల్ ను మీరు థియేటర్ లోనే చూడాలి. సునీల్ , శాన్వీ మధ్య హిలేరియస్ కామెడీ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది..థియేటర్ లలో "పుష్పక విమానం" ను ఎంజాయ్ చేయండి. అని అన్నారు.

  హీరోయిన్ శాన్వి మేఘన మాట్లాడుతూ..."పుష్పక విమానం" సినిమా ద్వారా నాకొక బిగ్ హిట్ దొరికింది. ఈ సినిమాలో ఆడియెన్స్ నా రేఖ క్యారెక్టర్ ను బాగా ఇష్టపడుతున్నారు. సునీల్ గారు, నా మధ్యన వచ్చే సీన్స్ అన్నీ నవ్విస్తున్నాయి. ఎక్కడ నవ్వుతారని మేం ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్సన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు స్వామి రారా అనే ఒక మంచి పాటను కూడా చివరలో పెట్టారు. ఆ పాట స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. అన్నారు.

  దర్శకుడు దామోదర మాట్లాడుతూ.."పుష్పక విమానం" చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ దర్శకుడిని కాబట్టి నా సినిమాను తెరపై చూస్తూ, నేను రాసిన కథకు, సీన్స్ కు, మాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే సంతృప్తిగా ఉంది. ఆనంద్, నిర్మాత విజయ్ గారు నేను చెప్పింది నమ్మి, నేను సినిమా కోసం అడిగింది ఇచ్చి చేయించడం వల్లే ఇవాళ ఈ సక్సెస్ వచ్చింది. నరేష్, సునీల్ క్యారెక్టర్ ల ద్వారా మంచి కామెడీ జెనరేట్ అయ్యింది. సినిమా బాగుందని తెలిసిన వాళ్లంతా వచ్చి "పుష్పక విమానం" సినిమాను చూడండి. అన్నారు.

  నటుడు హర్ష మాట్లాడుతూ..."పుష్పక విమానం" సినిమా థియేటర్ లలో రష్ చూశాను. ఎవ్రీ షోకు ఆడియెన్స్ పెరుగుతున్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ షాకింగ్ గా ఉంటుంది. అదేంటో థియేటర్ లలో చూడండి. కామెడీ, థ్రిల్ అన్నీ ఉన్న చిత్రమిది. అన్నారు.

  నటుడు గిరిధర్ మాట్లాడుతూ...నేను "పుష్పక విమానం" చిత్రంలో చెప్పిన ఐ కుడ్ సెన్స్ ఇట్ అనే డైలాగ్ కు ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. సినిమాలో ఆనంద్, హీరోయిన్స్ , సునీల్, నరేష్ నటన చాలా బాగుంది. నాకు "పుష్పక విమానం" తో మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. అన్నారు.

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ..."పుష్పక విమానం" అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు బాగా నచ్చింది. స్పెషల్ షోలను సెలబ్రిటీలకు వాళ్ల ఇంటి దగ్గరే ఏర్పాటు చేశాం. వాళ్లంతా బాగుందని కాల్స్ చేస్తున్నారు. థియేటర్ లలో మంచి రెస్పాన్స్ ఉంది. "పుష్పక విమానం" ను బిగ్ హిట్ చేసిన అందరికీ థాంక్స్. అన్నారు.

  English summary
  Pushpaka Vimanam team organised Thanks meet in hyderabad. Actor Anand Deverakonda celebrates Pushpaka Vimanam success.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X