Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మేమలా విడిపోయాం.. తన ప్రేమ గురించి ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఇటీవల కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన 'దొరసాని' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయినప్పటికీ ఆనంద్ నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఇందులో అతడి నటన విమర్శలకును సైతం ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా.. మెచ్యూరిటీతో నటించాడని చాలా మంది కొనియాడారు. అంతేకాదు, ఇందులో న్యూడ్‌గా నటించే ధైర్యం చేయడం కూడా చాలా మందిని మెప్పించింది.
ఈ నేపథ్యంలో ఆనంద్ మరికొన్ని సినిమాలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇప్పటికే రెండు సినిమాలకు సైతం సంతకాలు చేసేశాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడి గురించి ఓ శాడ్ స్టోరీ ఒకటి బయటకు వచ్చింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆనంద్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా 'దొరసాని' సినిమా విశేషాలతో పాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను వెల్లడించాడు. ఇందులో భాగంగానే తన ప్రేమ గురించి కూడా మాట్లాడాడు.
ఇక్కడి అమ్మాయితో ప్రేమల పడ్డానని చెప్పిన ఆనంద్.. ఆ తర్వాత తన లవ్ బ్రేకప్ అయిందని తెలిపాడు. ''నా లవ్ వర్కౌట్ కాలేదు. ఇద్దరం ఒక దగ్గర లేము. అందుకే విడిపోవాల్సి వచ్చింది. ఇక, లైట్ తీసుకోవడమే'' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రేమకథ అక్కడితో ఆగిపోయింది. అయితే, ఆనంద్ ప్రేమించిన అమ్మాయి ఎవరు..? ఆమె పేరు ఏంటి..? ఆమెది ఏ ఊరు..? అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నటించిన 'డియర్ కామ్రేడ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఇది తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందింది. ఇటీవల జరిగిన ఈ సినిమా మ్యూజికల్ ఫెస్ట్‌లో ఆనంద్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.