విజయ్ దేవరకొండను తొక్కేయాలని.. ఫ్యామిలీ స్టార్‌‌ను 48 గంటలకు ముందే.. ఆనంద్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దిల్‌రాజు నిర్మాణంలో పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా '' ది ఫ్యామిలీ స్టార్ ''. ఏప్రిల్ 5న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై కొందరు కావాలని నెగెటివ్‌గా ప్రచారం చేశారు. ఫ్యామిలీ స్టార్‌లోని మిస్టేక్ అనిపించిన సీన్స్‌, ఫోటోలు, స్క్రీన్ షాట్లను తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీని ప్రభావం సినిమాపై పడి.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టాన్ని మిగిల్చింది. నెగిటివ్ ప్రచారం కారణంగా ప్రేక్షకులు సినిమాను పట్టించుకోలేదు. నెగిటివ్ క్యాంపెయినింగ్‌ను తిప్పికొట్టడానికి స్వయంగా నిర్మాత దిల్‌రాజు మైక్ పట్టుకుని థియేటర్ల వద్ద రివ్యూలు తీసుకున్నారు.

నెగిటివ్ ప్రచారం కారణంగా థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది ది ఫ్యామిలీ స్టార్. అప్పుడు కూడా ''ఆ కొందరు'' విడిచిపెట్టలేదు. మళ్లీ ఫోటోలు, వీడియోలతో హల్‌చల్ చేశారు. కానీ ఈసారి నెగిటివ్ గ్యాంగ్ పాచికలు పారలేదు. ఓటీటీలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫ్యామిలీతో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నామని.. సినిమాపై కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం కారణంగా థియేటర్‌లో చూడలేకపోయాయని నెటిజన్లు పోస్టులు పెట్టారు. విజయ్, మృణాల్ అద్భుతంగా నటించారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ది ఫ్యామిలీ స్టార్‌కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

Anand Deverakonda has made sensational comments on the negative publicity of The Family Star movie

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై జరిగిన నెగిటివ్ ప్రచారంపై స్పందించారు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్. బేబీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన నటించిన ''గం గం గణేశా '' మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ ఓ దొంగగా కనిపిస్తున్నాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్న 'గం గం గణేశా'ను మే 31న రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్యామిలీ స్టార్‌పై జరిగిన నెగిటివ్ ప్రచారం , సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ స్పందించారు. కొన్ని ఏరియాలలో కావాలని సినిమాని టార్గెట్ చేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరు వ్యక్తిగతంగా వారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని.. కానీ ఒక గ్రూపుగా మారి, ట్రెండ్‌ నడిపి ఫ్యామిలీ స్టార్‌ని చంపేసే ప్రయత్నం చేశారని ఆనంద్ వ్యాఖ్యానించారు.

నా అన్న సినిమా రిలీజ్ కావడానికి 48 గంటల ముందే విజయ్ నటించిన పాత సినిమాల నెగిటివ్ టాక్ తీసుకొచ్చి.. ''ఫ్యామిలీ స్టార్ పబ్లిక్ టాక్'' అనే థంబ్‌నెయిల్స్ పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారని మండిపడ్డారు. నిర్మాతను, ట్రేడ్‌ను, బిజినెస్‌ను భయపెట్టాలని ఓ గ్రూప్ చేస్తోందని ఆనంద్ తెలిపారు. వాళ్లు ఎవరు..? ఎందుకు ఇదంతా చేస్తున్నారు..? అనేది కేవలం సైబర్ క్రైమ్ సెల్ మాత్రమే తేల్చగలదని ఆయన చెప్పారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఇండస్ట్రీని ఎటు వైపు తీసుకెళ్తున్నారు.. ఇది సరికాదని ఆనంద్ సూచించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X