Baby Twitter Review: అంతా ఆ పది నిమిషాలే.. ఆ బూతులు ఏంట్రా బాబు.. బేబి మూవీకి టాక్ ఎలా ఉందంటే!
హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. అయినప్పటికీ అతడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఫలితం మాత్రం లేకుండా పోయింది.
ఈ పరిస్థితుల్లో ఈ సారి గట్టిగానే కొట్టాలన్న కసితో 'బేబి' అనే యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు గురువారం రాత్రి నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 'బేబి' మూవీకి ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి!

బేబి అంటూ వచ్చిన ఆనంద్: ఆనంద్ దేవరకొండ - సాయి రాజేష్ కాంబోలో రూపొందిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మూవీ జూలై 14వ తేదీన గ్రాండ్‌గా విడుదల అవుతుంది.

అలాంటి కథ.. వాళ్లే టార్గెట్‌గా: ఓ బస్తీకి చెందిన ఓ అమ్మాయి హీరోతో ప్రేమలో పడడం.. ఈ క్రమంలోనే కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆమె జీవితంలోకి మరో వ్యక్తి రావడం.. ఈ కారణంగా హీరో హీరోయిన్ మధ్య మనస్పర్థలు పెరగడం వంటి అంశాలతో 'బేబి' మూవీ తెరకెక్కింది. ముఖ్యంగా ఇందులో యూత్‌కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలను జోడించారు. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉందంటూ: ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబి' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అందులో 'కొత్తగా ఏమీ లేకుండానే నెమ్మదిగా విలక్షణమైన ప్రేమకథతో బేబి మొదలవుతుంది. అయితే, కొన్ని మనసుకు హత్తుకునే డైలాగులు, మూమెంట్లతో ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఫస్టాఫ్ ఏవరేజ్‌గానే ఉంది' అని రాసుకొచ్చారు.
బేబి హిట్టు బొమ్మే అంటూ: ఆనంద్ దేవరకొండ - సాయి రాజేష్ కాంబోలో రూపొందిన 'బేబి' మూవీని వీక్షించిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో 'బేబి లెంగ్త్ ఎక్కువగా ఉన్న మూవీ. కానీ, ఇందులో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో ఏడిపించి చంపేశాడు. ఫైనల్‌గా ఇది హిట్టు బొమ్మ అని చెప్పొచ్చు. నా రేటింగ్ 3.25/5' అంటూ పోస్ట్ చేశారు.
ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది: 'బేబి' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు. అందులో 'సినిమా చాలా పెద్దదిగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. కాబట్టి కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకెండాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు మ్యూజిక్ బలమైన ఆస్తిలా ఉంది. యువత ఈ సినిమాను చూడొచ్చు' అంటూ రాసుకొచ్చారు.
నేటి పరిస్థితులకు తగ్గట్లుగా: 'బేబి' మూవీకి చూసిన మరో నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు. అందులో 'బేబి మూవీ సమకాలిన, నిజజీవిత అంశాలతో సాగే ప్రేమకథా చిత్రం. ఆనంద్ దేవరకొండ గుడ్, కానీ వైష్ణవి వన్ ఉమెన్ షో చేసింది. సాయి రాజేష్ రైటింగ్, డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫి బాగున్నాయి. ఫస్టాఫ్ బాగుంది.. సెకెండాఫ్ ఏవరేజ్‌గా ఉంది' అంటూ చెప్పొకొచ్చారు.
ఏవరేజ్‌గానే అనిపించింది: ఆనంద్ - వైష్ణవి జంటగా నటించిన 'బేబి' మూవీని చూసిన మరో నెటిజన్ 'బేబీ కాంటెంపరరీ లవ్ స్టోరీలా ఉంది. ఈ చిత్రం మీకు కావాల్సినవి అన్ని ఇవ్వదు. మొత్తంలో కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ డైలాగ్స్ మాత్రమే పని చేశాయి. మిగిలిన భాగం మొత్తం ఎమోషనల్ డెప్త్ లోపించింది. లెంగ్తీ సీన్స్ వల్ల సాగదీసిన ఫీలింగ్ కలిగింది. ఓవరాల్‌గా ఏవరేజ్. రేటింగ్ 2.5/5' అని చెప్పారు.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే: ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ఆధారంగా 'బేబి' మూవీకి డీసెంట్ టాక్ వచ్చిందనే చెప్పాలి. చాలా మంది ఈ చిత్రాన్ని చూడొచ్చని చెప్తున్నారు. అయితే, సెకెండాఫ్‌లో ఓ పది నిమిషాలు కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాలో బూతు డైలాగులు అలాగే ఉంచారట. వాటి వల్ల ఫ్యామిలీలు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











