Gam Gam Ganesha Twitter Review: ఊహించని విధంగా ఆనంద్ దేవరకొండ మూవీ టాక్.. ఇంతకీ హిట్టా ఫట్టా అంటే!

టాలీవుడ్‌లో కొందరు యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ఆనంద్ దేవరకొండ ఒకడు. హీరోగా పరిచయం అయిన తర్వాత ఎన్నో సినిమాలు చేసిన అతడు.. 'బేబి'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'గంగం గణేశా' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి మరి!

గంగం గణేశా అంటూ వచ్చాడు
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గంగం గణేశా'. ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించారు. ఇందులో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా చేయగా.. ఇమాన్యూయేల్, ప్రిన్స్ యావర్‌లు నటించారు. చైతన్ భరద్వాజ్ దీనికి సంగీతాన్ని అందించాడు.

Anand Deverakonda Starrer Gam Gam Ganesha Movie Twitter Review

అలాంటి కథతో థ్రిల్లింగ్‌గానే
దొంగతనాలు చేసే ఓ కుర్రాడి జీవితంలోకి ఓ పొలిటీషియన్, రాజావారు, విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకునే బ్యాచ్ ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ తర్వాత అతడికి వీళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే 'గంగం గణేశా'. కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.


ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉందంటూ
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమాను చూసిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో తన అభిప్రాయం చెప్పాడు. అందులో 'గంగం గణేశా మూవీ ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తికరంగా సాగింది. కానీ, అంతకు ముందు బోరింగ్‌గా అనిపించింది. హీరోయిన్ల సీన్స్ కూడా పేలవంగా వచ్చాయి' అని చెప్పుకొచ్చారు.


సరైన కమర్షియల్ ప్యాకేజ్
ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటించిన 'గంగం గణేశా' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'ఆనంద్ దేవరకొండ నుంచి సరైన కమర్షియల్ ఫ్యాకేజ్ ఈ సినిమా. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సెకెండాఫ్ థ్రిల్లింగ్‌గా ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఇమాన్యూయేల్, కృష్ణ చైతన్య తమదైన పాత్రలతో అలరించారు' అంటూ వివరించారు.


హిట్లు కంటిన్యూ అవుతాయి
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ 'గంగం గణేశా సరదాగా సాగే క్రైమ్ కామెడీ మూవీ. ఇందులో సమయానుగుణంగా వచ్చే కామెడీ, వెన్నెల కిశోర్ ట్రాక్ అలరించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉంది. తెలిసినా కథే అయినా ఉదయ్ బాగా చూపించాడు. ఆనంద్ దేవరకొండ హిట్లు కంటిన్యూ అవుతాయి' అని చెప్పారు.

ఓవరాల్‌గా అలాంటి టాక్
ఫుల్ జోష్‌లో ఉన్న ఆనంద్ దేవరకొండ నటించిన 'గంగం గణేశా' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్‌ను బట్టి దీనికి మంచి టాక్ వచ్చింది. చాలా మంది ఈ మూవీ బాగుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కామెడీ, ట్విస్టులు, క్లైమాక్స్ పార్ట్ అదిరిపోయిందని చెప్తున్నారు. మరి థియేటర్లలో మౌత్ టాక్ ఎలా వస్తుందో కాసేపట్లోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X