»   »  ‘బాహుబలి’ గురించి ఆయన ట్వీట్ ఇపుడు హాట్ టాపిక్

‘బాహుబలి’ గురించి ఆయన ట్వీట్ ఇపుడు హాట్ టాపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాపై ప్రేక్షక లోకంతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలో అతిపెద్ద సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్‌కు మనం ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తోంది.

ఈ సినిమాను, రాజమౌళి పనీ తీరును పొగుడుతూ ప్రముఖంలా ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఓ ప్రముఖుడు చేసిన ట్వీట్ ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఆయన ఈ దేశంలోని కుబేరుల్లో ఒకరు. ఆయనే మహీంద్రా గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా. బాహుబలి సినిమా ఇండియన్ సినిమా పరిశ్రమ సత్తా చాటేలా ఉందని, హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోలేదని ఆయన ట్వీట్ చేసారు.


 Anand Mahindra tweet about Baahubali‘బాహుబలి' సినిమా రిలీజైతే టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంతా ముందే ఊహించారు. ఎట్టకేలకు ఈ సినిమా సోమవారం(4వ రోజు).... 82 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.


ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం రూ. 83 కోట్లతో టాపులో ఉండేది. బాహుబలి చిత్రం కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి ‘బాహుబలి' 200 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు వెర్షన్ 83 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యే వరకు వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.


2009కి ముందు మహేష్ బాబు నటించిన ‘పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డుగా ఉండేది. 2009లో వచ్చిన ‘మగధీర' చిత్రం 9 రోజుల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత ‘అత్తారింటికి దారేది' చిత్రం మగధీర రికార్డు బద్దలు కొట్టడానికి దాదాపు 25 రోజుల సమయం తీసుకుంది. తాజాగా బాహుబలి కేవలం 4 రోజుల్లోనే ‘అత్తారింటికి దారేది' రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.English summary
Chairman and Managing Director of Mahindra Group Anand Mahindra tweeted, “#Baahubali is a staggering achievement. It’s scale&CGI finally unleash the potential of Indian mythology & folklore on the big screen”. Not stopping here, Anandcontinued saying, “But #Baahubali isn’t a Hollywood me-too. It retains an Indian DNA.A hypnotic soundtrack&quirky yet creative romantic scenes make it unique.”
Please Wait while comments are loading...