twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జై సింహ’ బాలయ్య సీన్....మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘జై సింహ’ బాలయ్య సీన్.... మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్ !

    బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'జై సింహ' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంతృప్తికరంగా ఫలితాలు సాధిస్తోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఓ సీన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    బొలెరో సీన్

    ‘జై సింహ' చిత్రంలో ఓ సీన్లో పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ తో బాలయ్య వాగ్వాదానికి దిగుతాడు. ఈక్రమంలో తన పవర్ చూపించడానికి ఒంటిచేత్తో బొలెరో కారు పైకి ఎత్తే సీన్ ఒకటి ఉంది. ఇపుడు ఈ సీన్ హాట్ టాపిక్ అయింది. బాలయ్యకు మాత్రమే ఇలాంటి సీన్లు సూట్ అవుతాయని అంటున్నారు.

    ఆనంద్ మహింద్రా

    మహిద్రా బొలెరో కారును బాలయ్య ఒంటిచేత్తో పైకి లేపే సన్నివేశంపై మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘హాహా.. బొలెరో కార్లను చెక్ చేయాడానికి మా సర్వీసింగ్ సెంటర్లలో ఇకపై హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనవసరం లేదు'' అని ట్వీట్ చేశారు.

    సరదా కామెంట్

    సరదా కామెంట్

    బోలెరో సీన్ కావడంతో.... ఈ విషయాన్ని కొందురు నెటిజన్లు ఆనంద్ మహింద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలా సరదాగా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహింద్రా కామెంట్స్‌తో ‘జై సింహ' సినిమా గురించి, బాలకృష్ణ గురించి ఇతర రాష్ట్రాల్లోనూ మార్మోగి పోతోంది.

    జై సింహ

    జై సింహ

    నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన "జై సింహా" జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

     ‘జై సింహ' కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)

    ‘జై సింహ' కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)

    'అజ్ఞాతవాసి' సినిమాను రివ్యూ చేసిన తనదైన అభిప్రాయాలు వెల్లడించిన మహేష్ కత్తి...బాలయ్య 'జై సింహ' చిత్రంపై విమర్శనాత్మకంగా స్పందించారు.

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.</strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    "Haha. Now all our service workshops won’t need any hydraulic lifts anymore to do Bolero check-ups!!" Anand Mahindra tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X