'ఓయ్' దర్శకుడు తదుపరి చిత్రం ప్రకటన
తాజ్‌కిరణ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళుతుంది. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తారు. ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ప్రేమికుల రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్నటించబోతోంది''అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
ఇక ఆనంద్ రంగా, 'ఎవరైనా ఎపుడైనా'తో డైరక్టర్ అయిన శంకర్ మార్తాండ్ కలిసి ఓ హారర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఆ చిత్రం ఏమైందో తెలియరాలేదు. ఆ చిత్రం టైటిల్ 'పొగ'. 'ఫియర్ ఈజ్ ఇన్‌జ్యూరియస్ టు లైఫ్' అనేది ట్యాగ్ లైన్. నవదీప్, మధుశాలిని, రణధీర్, అర్చన, సౌమ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఈ దర్సకులు ఇద్దరూ మాట్లాడుతూ...''తెలిసో, తెలియకో... జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. మా కథలోనూ కొందరు అనుకోకుండా తప్పులు చేశారు. వాటి ఫలితం ఎలా అనుభవించారో తెరపైనే చూడాలని'' చెబుతున్నారు. అలాగే ఈ చిత్రంలోని పాత్రలు అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తాయి. అయితే ఆ తప్పులకు వారు ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకున్నారనేది ఈ చిత్రకథ. వెన్నులో వణుకు పుట్టేవిధంగా ఇందులో సన్నివేశాలుంటాయి. 'జో డర్‌గయా వో మర్‌గయా' అనే హిందీ పాపులర్ డైలాగ్ ఈ చిత్రానికి కూడా వర్తిస్తుంది'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications












