వైఎస్ఆర్‌గా నాగార్జున.. బయోపిక్‌ దర్శకుడు ఇతనే... ఇంట్రెస్టింగ్ న్యూస్..

By Rajababu

Recommended Video

ఆ బయోపిక్ లో.. వైఎస్ఆర్‌గా నాగార్జునా ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2009 హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో నాగార్జున దివంగత నేతగా నటించే అవకాశాలున్నట్టు మీడియాలో ఓ వార్త షికారు చేస్తున్నది.

మహీ రాఘవ డైరెక్షన్

మహీ రాఘవ డైరెక్షన్

వైఎస్ఆర్ బయోపిక్‌ను విజయ్ చిల్లా, శశిధర్ దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇటీవల చిన్న చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న ఆనందో బ్రహ్మ చిత్రానికి దర్శకత్వం వహింిన మహి రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

 జాగ్రత్తగా స్క్రిప్టు వర్క్

జాగ్రత్తగా స్క్రిప్టు వర్క్

ఈ నేపథ్యంలో మహి రాఘవ మీడియాతో మాట్లాడుతూ.. స్క్రిప్టు వర్క్ పూర్తయింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కావడం మూలాన ఈ చిత్రం పనులు, స్క్రిప్టు వర్క్‌పై జాగ్రత్తగా పనిచేస్తున్నాం. అందుకే కొంత జాప్యం జరుగుతున్నది.

 ఏ నటుడిని సంప్రదించలేదు

ఏ నటుడిని సంప్రదించలేదు

వైఎస్ఆర్ పాత్రను పోషించడానికి ఏ నటుడిని ఇంకా సంప్రదించలేదు. స్క్రిప్టును పూర్తిగా లాక్ చేసిన తర్వాత నటీనటులు ఎంపికపై దృష్టిపెడుతాం. మా పరిశీలనలో కొంతమంది నటీనటులు ఉన్నారు. ఇప్పుడే వారి పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాదు అని మహీరాఘవ అన్నారు.

 తెరపైకి నాగార్జున పేరు

తెరపైకి నాగార్జున పేరు

వైఎస్ఆర్ బయోపిక్‌లో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ పాత్రకు తెలుగు నటులైతే బాగుంటుందనే అభిప్రాయాల కారణంగా హీరో నాగార్జునతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

వైఎస్ఆర్ జీవితంలో

వైఎస్ఆర్ జీవితంలో

రెండు దశాబ్దాలకుపైగా ఉండే వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లాంటి ఆయనను మహానేతగా చేసింది.

ఏపీలో రాజకీయ వేడి

ఏపీలో రాజకీయ వేడి

2019లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలుగు సినిమా, రాజకీయ రంగాలలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రెండు, మూడు సినిమాలు రావడానికి కసరత్తు జరుగున్నది. తేజ దర్శకత్వంలో బాలకష్ణ నటిస్తున్న బయోపిక్ త్వరలోనే ప్రారంభం కానున్నది.

 టాలీవుడ్‌లో బయోపిక్‌ల హల్‌చల్

టాలీవుడ్‌లో బయోపిక్‌ల హల్‌చల్

టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఒక్కసారిగా పెరిగింది. మహానటి సావిత్రి బయోపిక్, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహరెడ్డి, బాడ్మింటన్ క్రీడాకారుడు గోపిచంద్ జీవితాలపై చిత్రాలు రూపొందడానికి సిద్ధమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X