తెరపై అనంత పద్మనాభుడి కథ..డిటేల్స్

By Srikanya

Anantha Padmanabha Swamy Temple
సంచలన కథనాలు ఎప్పుడూ సినమాలుకు కథలే. దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో చరిత్రకెక్కిన పద్మనాభస్వామి ఆలయ సిరిసంపదల ఇతివృత్తం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి మార్తాండ వర్మ అనే టైటిల్ ఖరారు చేశారు. అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేల మాళిగలో స్వర్ణ, వజ్ర, వైఢూర్యాలతో కూడిన 1.5 లక్షల కోట్ల విలువైన ఆభరణాలు ఇప్పటి వరకు వెలికితీసిన విషయం తెలిసిందే. స్వామి వారి ఆరవ గదిలో మరింత సంపద ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనలను తిరువాంగూర్ రాజా మార్తాండ వర్మ జీవిత చరిత్రతో కలిపి ఆంగ్లం, మల యాళం భాషలలో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజా మార్తాండ వర్మ 1729 నుంచి 1758 వరకు తిరువాంగూర్‌ను పాలించి ఉన్న దృష్ట్యా దీనికి మార్తాండ వర్మ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దుబాయ్‌కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ దీన్ని రూపొందించనుంది. ప్రముఖ రచయిత జె.జయకుమార్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. కె.శ్రీకుమార్ దర్శకత్వం వహించనున్నారు. నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రాన్ని తమళ,తెలుగు భాషల్లోకి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యన టీవిలో రోజుకి ఒకసారైన అనంత పధ్మనాభ స్వామి గురించి చెప్తూండటం ఈ సినిమాకు ఉచిత పబ్లిసిటీగా భావిస్తోంది. మరో ప్రక్క సంతోష్ శివన్ రీసెంట్ గా మళయాళం లో రూపొందించిన ఉరిమి చిత్రం కూడా చారిత్రక కథ కావటం..అది మంచి విజయం సాదించటం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అంతులేని సంపదతో వార్తల్లో నిలుస్తోంది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో సుమారు ఐదు లక్షల కోట్ల ఆస్తుల వరకు కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. వాటి విలువ అంత ఉండదని ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నప్పటికీ ఆ సంపద విలువ భారీగానే ఉంటుందనే వారూ ఉన్నారు. ఈ ఐదు నేలమాళిగలలో కంటే ఆరోగదిలో ఇంతకంటే ఎక్కువ సంపద ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆరో నేలమాళిగ తెరవకూడదని దానికి నాగబంధం ఉందని భక్తులు, ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం ఆరోనేల మాళిగను తెరవడానికి సిద్ధమైన సందర్భంలో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరో గదిని తాము ఆదేశించే వరకు తెరవకూడదని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా గురువారం రోజు సుప్రీంకోర్టు ఆరో నేలమాళిగ విషయంలో తమ ఆదేశాలు జారీ చేయనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలు కోసం ఇటు కేరళ ప్రభుత్వం, అటు భక్తులు సైతం వేచి చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X