అనన్య కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీ.. లైంగిక వేధింపులపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
దాదాపు ప్రతీ సినీ పరిశ్రమలో కూడా ఆర్టిస్టులకి సంబంధించి కాస్టింగ్ కౌచ్ అనే మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందని తెలిసిందే. కాగా ఆయా భాషలకి చెందిన సినీ పరిశ్రమల్లో హీరోయిన్స్ లేదా మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొనే లైంగిక ఇబ్బందులు విషయంలో ఈ మాట అధికంగా వినిపిస్తూ వస్తుంది. కాగా ఆ మధ్య అంతా కాస్టింగ్ కౌచ్ విషయంలో మీ 2 అనే ఓ ట్రెండ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారడం అది కొన్నాళ్ల పాటు ఎన్నో కాంట్రవర్సీలకి కూడా దారి తీసింది.
ఆ తర్వాత కొన్నాళ్ళకి అది తగ్గింది కానీ మళ్ళీ కొన్ని నెలలు కితమే మన సౌత్ సినిమా దగ్గర మరోసారి మహిళా నటులకి సంబంధించి పలు షాకింగ్ నిజాలు బయటకి వచ్చాయి. మళయాళ సినిమా ఇండస్ట్రీ దగ్గర తెర పైకి వచ్చిన హేమ కమిటీ ద్వారా చాలా అంశాలు వెలుగులోకి రాగా మన దగ్గర స్టార్ హీరోయిన్స్ కూడా ఇక్కడ ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక ఇదీ అయ్యిన తర్వాత ఇప్పుడు మన టాలీవుడ్ లో మరోసారి కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కాంట్రవర్సీ వైరల్ గా మారింది. మన తెలుగు సినిమా దగ్గర అసలే తెలుగు హీరోయిన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. కాగా ఉన్న ఆ కొద్ది మంది హీరోయిన్స్ లో యువ బ్యూటీ అనన్య నాగళ్ళ కూడా ఒకామె కాగా అనన్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో మంచి ఫేమ్ ని తెచ్చుకుంది.
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ భారీ ఆఫర్లు అయితే తనకేమి రాలేదు. అయినప్పటికీ తనకి వచ్చిన కొన్ని సినిమాలులో మంచి సినిమాలు చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇలాంటి తెలుగు హీరోయిన్ పై కాస్టింగ్ కౌచ్ ప్రశ్న ఇపుడు షాకింగ్ గా మారింది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం "పొట్టేల్" ప్రమోషన్స్ లో ఆమెకు ఎదురైన ఈ ప్రశ్నపై బుల్ షిట్ అంటూ ఆమె గట్టిగా స్పందించింది.

అయితే ఈమెతో వర్క్ చేసిన నిర్మాత ఒకరు ఈ కాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్లతో వర్క్ పై కామెంట్స్ చేశారు. అనన్య నటించిన ఫీల్ గుడ్ చిత్రం "మల్లేశం" ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్దా రెడ్డి అనన్య విషయంలో తమ సినిమా షూటింగ్ టైం లో తీసుకున్న జాగ్రత్తలు కోసం వివరించారు.
"అనన్య మొదటి సినిమా మల్లేశం మల్లేశం సినిమా చాలా వరకూ పోచంపల్లిలో జరిగింది. పోచంపల్లిలో ఉండడానికి హోటల్స్/లాడ్జ్ ఉండవు కాబట్టి అక్కడ కొన్ని ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాం. అనన్య ఒక్కటే అమ్మాయి టీంలో. ఆ అమ్మాయితో ఉండడానికి తోడుగా మరొకరిని ఉంచి, ఆ అమ్మాయి సేఫ్ గా ఉండడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
అలాగే ఆ సినిమాలో యాక్ట్ చెయ్యడానికి, పని చెయ్యడానికి వచ్చిన అందరు మేజర్ యాక్టర్స్/టెక్నీషియన్స్ తో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ముఖ్యంగా ఎటువంటి సెక్సువల్ అబ్యూజ్ జరిగినా వాళ్లని ఉన్నపళంగా ఆ సినిమానుంచి తప్పిస్తామని అగ్రిమెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కమిట్మెంట్ కామన్ అని అనుకునేవాళ్లకి, లేదు ఇలా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కూడా సినిమా నిర్మాణం జరుగుతుందని మరికొంతమందికైనా తెలియాలని." తాను ఆమె విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది రివీల్ చేశారు.
అలాగే దీనికి అనన్య కూడా రిప్లై ఇచ్చింది. తనకి ఆ కాంట్రవర్సియల్ ప్రశ్న ఎదురైనపుడు సరిగ్గా నాకు కూడా మల్లేశం సినిమా సమయంలో మనం చేసుకున్న ఈ అగ్రిమెంట్ నే గుర్తొచ్చింది అని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో అనన్య విషయంలో మాత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ రచ్చ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











