VakeelSaab Pre release event: జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.. పవన్ కళ్యాణ్‌పై అనన్య నాగళ్ల కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై ఉన్న హైప్, బజ్ గురించి ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఈక్రమంలో నేటి సాయంత్రం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనన్య నాగళ్ల మాట్లాడుతూ వకీల్ సాబ్,పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... తారలతో వేడుక కళకళ.. ఎవరెవరూ వచ్చారంటే..

ఎంతో ప్రిపేర్..

ఎంతో ప్రిపేర్..

అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. 'మీ అందరూ జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎంతో మాట్లాడాలి అని ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యాను. కానీ ఇప్పుడు ఏం గుర్తుకు లేదు. ఈ క్షణం ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన అతిథులందరికి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమాలో...

తెలుగు సినిమాలో...

నేను చిన్న ప్రాంతం నుంచి వచ్చాను. నాలా కలలను నిజం చేసుకునేందుకు ఎంతో మంది వస్తుంటారు. వారి ప్రయాణంలో ఎన్నో సార్లు ఎంతో మంది చేత తిరస్కరానికి గురై ఉంటారు. తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాలో చాన్స్ ఇవ్వరని అంటుంటారు అని అనన్య చెప్పుకొచ్చింది.

 కారణం ఆయనే..

కారణం ఆయనే..

వకీల్ సాబ్ లాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఎంతో మందికి హోప్ ఇచ్చారు. నేను ఇక్కడ ఉన్నానంటే కారణం డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఆయన తన సొంత ఇంటిపిల్లలా నన్ను చూసుకున్నారు. తప్పులు చేస్తే కోప్పడ్డారు. బాగా చేస్తే మెచ్చుకున్నారు అని అనన్య తెలిపింది.

ఇంత త్వరగా..

ఇంత త్వరగా..

బొమ్మరిల్లు సినిమా చూసినప్పుడు ఇలాంటి బ్యానర్‌లో ఎప్పుడు సినిమా చేస్తానా? అని అనుకున్నాను. కానీ నాకు ఇంత త్వరగా అవకాశం వస్తుందని అనుకోలేదు. దిల్ రాజు గారికిథ్యాంక్స్. ఇక సెట్‌లో సరదాగా అనిపించిందంటే దాని కారణం అంజలి. నివేదా థామస్ నుంచి ఎంతో నేర్చుకున్నాను అని అనన్య చెప్పుకొచ్చింది.

 జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను..

జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను..

అనన్య నాగళ్ల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..'వకీల్ సాబ్ జర్నీని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. ఇంకెంతో తెలుసుకున్నాను. కొత్త అమ్మాయిని కదా? అని నాకు ఎక్కువ కంఫర్ట్ ఇచ్చారు.. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.. మీరిచ్చిన కాంప్లిమెంట్స్ గుర్తున్నాయి.. మీరు నాకోసం చేసిన ప్రతీ దానికి థ్యాంక్స్'అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X