OTTలోకి భయపెట్టేందుకు వచ్చేసిన తెలుగమ్మాయి హారర్ థ్రిల్లర్​ - ఎక్కడ చూడాలంటే?

వీకెండ్​ వచ్చేసింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్​ కొత్త సినిమాలను విడుదల చేయడం మొదలుపేట్టేశాయి. అలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? వంటి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో నటించిన తెలుగందం నటి అనన్య నాగళ్ల. ఆ సినిమా తర్వాత నుంచి ఈమె ప్రధాన పాత్రల్లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలా ఈ మధ్య ఈమె చివరగా నటించిన సినిమా తంత్ర. ఇందులో అనన్య నాగళ్లతో పాటు ఒకప్పటి హీరోయిన్ సలోని, మీసాల లక్షణ్, టెంపర్ వంశీ ఇతర పాత్రల్లో నటించారు.

ananya nagalla tantra movie ott streaming in aha platform See the full details are here

ఈ సినిమాకు ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేశ్​ బాబు, రవి చైతన్య ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. శ్రీనివాస్ గోపిశెట్టి పుల్ లెంగ్త్​ హారర్ జానర్​గా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో వచ్చి ప్రేక్షకులను పలకరించింది. దీనికి మొదట్లో మంచి రెస్పాన్సే వచ్చినప్పటికీ లాంగ్​ రన్​లో నిలబడలేకపోయింది. కానీ ఈ చిత్రంలో భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయంటూ రివ్యూలు కూడా వచ్చాయి. అలా టాక్ పరంగా మంచిగానే ఉన్నా కలెక్షన్లను అందుకోలేకపోయింది. ఫలితంగా కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్​ కాలేకపోయింది.

కానీ ఇప్పుడీ చిత్రం విడుదలై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను కొనుగోలు చేసింది. మంచి ధరకే దక్కించుకుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్రం ఇప్పుడు ముందుగా చెప్పినట్టే ఏప్రిల్ 5 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన వారు తంత్ర సినిమాను ఓటీటీలో చూసేయండి..

ananya nagalla tantra movie ott streaming in aha platform See the full details are here

ఇకపోతే ఈ చిత్రంలో క్షుద్రపూజల గురించి చూపించారు. ఇందులో అప్పట్లో ఓ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి క్షుద్రపూజ నేర్చుకున్నాడని అంటూ బాగా ఆసక్తిని పెంచారు. సినిమాలో రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుక‌తోనే త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మిని (స‌లోని) కోల్పోయి నాన్నమ్మ సంరక్షణలో పెరుగుతుంది. తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ప్రేమిస్తుంది. కానీ అతడు వేశ్య కొడుకు కావ‌డంతో వారి ప్రేమ‌కు అడ్డంకులు ఎదురౌతాయి. అయితే క్షుద్ర శ‌క్తుల కార‌ణంగా జ‌న్మించ‌డం వల్ల రేఖ చుట్టూ ఎప్పుడూ ద‌ెయ్యాలు ఉంటాయి. పౌర్ణ‌మి వ‌చ్చిందంటే రేఖ‌ను వెతుక్కుంటూ ఏకంగా ఓ ర‌క్త పిశాచి వ‌స్తుంటుంది. మరి చివరికి ఏమైందనేదే ఈ సినిమా కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X