twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RIPTNR: ‘వకీల్ సాబ్’ హీరోయిన్ అలా అవడానికి TNR కారణం.. ఆయన మరణంపై సెలెబ్రిటీల నుంచి ఊహించని స్పందన

    |

    చాలా కాలంగా జర్నలిజం ఫీల్డులో విశేషమైన సేవలు అందించడంతో పాటు ఈ మధ్య కాలంలో నటుడిగా బిజీ అయిపోయిన టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆయన.. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం టీఎన్నార్ పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం వరకూ మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

    నన్ను చాలా కలచి వేసింది: సునీల్

    నన్ను చాలా కలచి వేసింది: సునీల్

    ప్రముఖ జర్నలిస్టు కమ్ యాక్టర్ టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) మరణ వార్తపై ప్రముఖ నటుడు సునీల్ స్పందించాడు. తన ట్విట్టర్‌లో 'టీఎన్నార్ గారి మరణ వార్త నన్ను కలిచి వేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యాను. మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్' అంటూ రాసుకొచ్చాడు.

    ఆ వార్త విని షాకయ్యాను: శ్రీను వైట్ల

    ఆ వార్త విని షాకయ్యాను: శ్రీను వైట్ల

    టీఎన్నార్ మరణ వార్తపై ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'టీఎన్నార్ గారి మరణ వార్తను విని షాక్‌కు గురయ్యాను. మిస్ అవుతున్నాం సార్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను' అంటూ పోస్ట్ చేశారు.

    మనసున్న మనిషిని కోల్పోయాం: మనోజ్

    మనసున్న మనిషిని కోల్పోయాం: మనోజ్


    జర్నలిస్టు టీఎన్నార్ మృతిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'ప్రముఖ జర్నలిస్టు, నటుడు, అన్నింటికీ మించి మంచి మనసున్న మనిషి టీఎన్నార్ గారి మరణ వార్తను విని షాకయ్యాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ పేర్కొన్నాడు.

    అవెప్పటికీ గుర్తుంచుకుంటాను: విజయ్

    అవెప్పటికీ గుర్తుంచుకుంటాను: విజయ్

    పేరున్న జర్నలిస్టు టీఎన్నార్ కరోనాతో మరణించడంపై క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'మన మధ్య జరిగిన రెండు సుదీర్ఘమైన సంభాషణలు.. ఆ సందర్భంలో మీరు చూపించిన ఆసక్తి, ప్రేమ, సహనాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను సార్. మీ మరణ వార్త మా ఇంట్లోని వాళ్లందరినీ కలచి వేసింది' అంటూ పోస్ట్ చేశాడు.

    నేను చేసిన వాటిలో అదే బెస్ట్: విష్ణు

    నేను చేసిన వాటిలో అదే బెస్ట్: విష్ణు

    టీఎన్నార్ మరణ వార్తపై హీరో మంచు విష్ణు స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'టీఎన్నార్ గారి మరణ వార్త నన్ను బాధించింది. ఏడాది క్రితం ఆయనతో చేసిన ఇంటర్వ్యూనే నా కెరీర్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకిది భయంకరమైన కలగా ఉంది' అంటూ రాసుకొచ్చాడు.

    ఎప్పటికీ గుర్తుండే వ్యక్తి: కొరటాల శివ

    ఎప్పటికీ గుర్తుండే వ్యక్తి: కొరటాల శివ


    జర్నలిస్టు టీఎన్నార్ మరణంపై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'పాపులర్ జర్నలిస్టు టీఎన్నార్ గారి మరణం షాక్‌కు గురి చేసింది. ఆయనతో ఇంటర్వ్యూ ఎంతో సరదాగా సాగింది. ఆయన జర్నలిజం‌ను మనం ఎప్పటికీ గుర్తించుకుంటాం. టీఎన్నార్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా' అని పేర్కొన్నాడు.

    Recommended Video

    Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
    నా కెరీర్ మొదలైంది మీ వల్లే సార్: అనన్య

    నా కెరీర్ మొదలైంది మీ వల్లే సార్: అనన్య


    జర్నలిస్టు టీఎన్నార్ మృతిపై 'వకీల్ సాబ్' నటి అనన్య నాగళ్ల స్పందించింది. తన ట్విట్టర్‌లో 'నా కెరీర్ మొదలవడానికి కారణం మీరే సార్. మీరు ఇక లేరన్న వార్తను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. నేనెప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతాను సార్' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

    English summary
    T Narasimha Reddy, popularly known as TNR (for his interview show Frankly Speaking With TNR), is reportedly critical. The star anchor is currently in hospital undergoing treatment for Covid-19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X