ఆర్యన్ ఖాన్ ఫోన్ వల్ల చిక్కుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఆ చాట్ వల్లే ఇరుక్కుని?

ముంబై డ్రగ్స్ క్రూయిస్ కేసులో ఎన్‌సిబి దర్యాప్తు ముమ్మరం చేసింది. షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను విచారించిన తర్వాత, ఒక వర్ధమాన నటి పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు, అనన్య పాండే. గురువారం నాడు అధికారులు అనన్య పాండే ఇంటికి చేరుకున్నారు. ఈ అధికారుల బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. నటికి సమన్లు ​​జారీ చేయబడ్డాయి. ఆ వివరాల్లోకి వెళితే

అలా సినీ ఎంట్రీ

అలా సినీ ఎంట్రీ

అక్టోబర్ 3 న ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సిబి దాడి చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్న కేసులో ఆర్యన్ ఖాన్‌ను మరో ఏడుగురితో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పుడు అనన్య పాండే పేరు తెర మీదకు వచ్చింది. అనేక హిందీ చిత్రాల్లో భాగమైన నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య. అనన్య పాండే 2019 లో "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2" చిత్రంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

అనన్య ఇంటికి

అనన్య ఇంటికి

ముంబైలోని ఖార్ వెస్ట్‌లోని అనన్య పాండే నివాసానికి ఎన్‌సిబి బృందం గురువారం చేరుకుంది. అనన్య పాండేను మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కమ్మని ఎన్‌సిబి పిలిచింది. ఎన్‌సిబి బృందం అనన్య పాండే ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. అలాగే ఎన్‌సిబి బృందం పేపర్‌ వర్క్‌ కోసం షారూఖ్ ఖాన్ ఇల్లుమన్నత్‌ని కూడా సందర్శించింది. అంతకు ముందు షారుఖ్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలులో అతని కుమారుడు ఆర్యన్‌ను కలిశాడు. వారి మధ్య గ్లాస్ డోర్ అడ్డు ఉండగా వారు ఇంటర్‌కామ్ ద్వారా దాదాపు 18 నిమిషాలు మాట్లాడారు.

బెయిల్ అప్పుడే

బెయిల్ అప్పుడే

ఇక ఆర్యన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు అక్టోబర్ 26 న విచారణ చేపట్టనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ గురించి ఆర్యన్ ఖాన్‌ విచారణలో భాగంగా అనన్యను పిలవడంతో అనన్య పాండేపై ఎన్‌సిబి ఉచ్చు బిగించిందనే ప్రచారం మొదలయింది. బాలీవుడ్ నటి అనన్య పాండే షారుఖ్ ఖాన్ కుటుంబంతో చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే.

సుహానాకు చిన్ననాటి స్నేహితురాలు

సుహానాకు చిన్ననాటి స్నేహితురాలు

అనన్య షారుఖ్ కూతురు సుహానాకు చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరూ చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, వారి మధ్య మొదలయిన స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో తీసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. సుహానాతో మాత్రమే కాదు, ఆర్యన్ మరియు అబ్రామ్‌తో కూడా అనన్య చాలా సమయం గడుపుతూ ఉంటుందని అంటున్నారు.

డ్రగ్స్ చాట్‌లో

డ్రగ్స్ చాట్‌లో

అనన్య పాండేతో పాటు, ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా పేరు కూడా డ్రగ్స్ చాట్‌లో కనిపించిందని అంటున్నారు. అందుకే ఆమెను విచారణకు హాజరు కమ్మని కోరినట్టు చెబుతున్నారు. అనన్య పాండే, విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
టాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ ఎంట్రీ

లైగర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అనూహ్యంగా అనన్య పాండే పేరు డ్రగ్స్ కేసులో బయటకు రావడంతో లైగర్ యూనిట్లో టెన్షన్ నెలకొంది అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ - చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటిస్తుండడంతో సినిమా మీద ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ అయింది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X